Leader Rerelease: రీరిలీజ్ కాబోతున్న రానా బ్లాక్ బస్టర్ మూవీ.. ఏరోజంటే?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో... రానా దగ్గుబాటి హీరోగా వచ్చిన లీడర్ సినిమా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భతమైన కథతో వచ్చి అందరినీ మెస్మరైజ్ చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు రాబట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే థియేటర్లలోకి వచ్చిన 14 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీరిలీజ్ కాబోతుంది. అయితే ఏరోజు ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2010లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సినిమానే లీడర్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మాత డి. రామానాయుడు మనుమడు, నిర్మాత దగ్గుబాటి సురేష్ కుమారుడు, దగ్గుబాటి రానా ఈ సినిమా ద్వారానే తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టారు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా రాజకీయ నాయకుల అవినీతి, పదవీ కాంక్షల చుట్టూ సాగే కథ ఆసక్తి రేకెత్తించగా.. రానా యాక్టింగ్ మరింత ప్లస్ అయింది.

రానా హీరోగా చేసిన ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్ లు హీరోహీరోయిన్లుగా నటించి మెప్పించారు. అలాగే సుబ్బరాజు, హర్షవర్ధన్, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, తనికెళ్ల భరణి, సుహాసిని, సుమన్, ఉదయ భాను, శత్రు వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సూపర్ హిట్ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా.. ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం శరవణన్, ఎంఎస్ గుహన్ లు నిర్మించారు.
అయితే ఎన్నికల సమయంలో.. ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నారు. మే 13వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండగా.. ఈ సినిమాను మే 9వ తేదీన రీరిలీజ్ చేయబోతున్నారట. ఎన్నికల సమయంలోనే ఈ చిత్రం మరోసారి థియేటర్లలోకి వస్తుండడంతో అంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. చూడాలి మరి రీరిలీజ్ అయి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందనేది.. బాక్సాఫీసు వద్ద ఎంతమేర కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనేది.


Click it and Unblock the Notifications











