HBD Rana: రాక్షస రాజాగా మారిన రానా.. ఇది మామూలు సర్‌ప్రైజ్ కాదుగా!
బడా ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమై ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ హీరో దగ్గుబాటి రానా. కెరీర్ ఆరంభంలో అంతగా సక్సెస్ కాలేకపోయిన అతడు.. ఆ తర్వాత సరికొత్త ప్రయోగాలతో సత్తా చాటాడు. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే హీరోగా, సపోర్టింగ్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం దగ్గుబాటి రానా కాస్త స్పీడు తగ్గించాడు. దీంతో అతడి అభిమానులు మాత్రం నిరాశకు లోనవుతున్నారు.
చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న దగ్గుబాటి రానా.. ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు తన కొత్త సినిమాను టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తేజతో చేయబోతున్నాడు. ఈ విషయాన్ని తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా దగ్గుబాటి రానా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించాడు. అంతేకాదు, ఈ చిత్రానికి 'రాక్షస రాజా' అనే టైటిల్‌ను కూడా పెట్టినట్లు అనౌన్స్ చేశాడు. ఈ మేరకు ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా దగ్గుబాటి రానా విడుదల చేశాడు.

తాజాగా విడుదలైన 'రాక్షస రాజా' ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దగ్గుబాటి రానా నుదిటిపై నామాలు పెట్టుకుని డిఫరెంట్ గెటప్‌తో కనిపించాడు. అంతేకాదు, భుజం మీద పెద్ద గన్‌ను పట్టుకుని ఉన్నాడు. అలాగే, ఒకవైపు బుల్లెట్లను కూడా వేసుకున్నాడు. మొత్తానికి ఈ పోస్టర్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా 'రాక్షస రాజా' పోస్టర్ డిజైన్ చేసినట్లు ఉంది. ఫలితంగా ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.
గతంలో తేజ - దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో 'నేనే రాజు నేనే మంత్రి' అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. దీంతో దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక, ఇప్పుడు 'రాక్షస రాజా' ప్రకటించడంతో ఇది అదేనేమో అని అంతా అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











