Daniel Shekhar: మాట నిలబెట్టుకున్న నిర్మాత.. అప్పుడే లెక్కలేస్తే ఎట్టా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా కాంబినేషన్ లో భీమ్లా నాయక్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం ప్రకటించిన టైటిల్ మీద వివాదం చెలరేగింది. అయితే ఆ వివాదాన్ని సినిమా మేకర్స్ సద్దుమణిగేలా చేయడానికి వెంటనే రంగంలోకి దిగారు. ఈ విషయం మీకు ఇప్పటికే అర్ధం అయ్యే ఉంటుంది. అవును ఈ సినిమా విషయంలో రానాకు అన్య్యాయం చేస్తున్నారనే విషయమే. తాజాగా రానా అప్డేట్ ఇవ్వడానికి సిద్దమైంది యూనిట్. ఆ వివరాల్లోకి వెళితే

సూపర్ హిట్

సూపర్ హిట్

అయ్యప్పనుం కోషియం సినిమాని మలయాళంలో బిజు మీనన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రధారులుగా తెరకెక్కించారు. బిజు మీనన్ ఒక ఏజెన్సీ ప్రాంతంలో పోలీస్ అధికారిగా పని చేస్తూ ఉండగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు.. నో ఆల్కహాల్ జోన్ పరిధిలో ఉన్న ఏజెన్సీ ఏరియాలో ఆల్కహాల్ తో ప్రయాణిస్తూ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక జాయినీ ఆపరేషన్ లో పట్టుబడతారు..

అయితే మద్యం మత్తులో ఉన్నప్పుడు సుకుమారన్ బిజు మీనన్ మీద చేయి చేసుకునే పరిస్థితి రావడంతో వీరిద్దరి మధ్య ఇగో వార్ మొదలవుతుంది. ఇగో వార్ ఒకరినొకరు చంపుకునే వరకు ఎందుకు వెళ్ళింది ? అనే దానిని ఆసక్తికరమైన రీతిలో చూపడంతో సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచింది.

అప్పట్లోనే కొనేసి

అప్పట్లోనే కొనేసి


సినిమా కథా కథనాలు బాగా నచ్చడంతో అప్పట్లోనే సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వెంటనే తెలుగు రీమేక్ హక్కులు కొనుగోలు చేసింది. రానా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సాగర్ కే చంద్ర దర్శకుడిగా మొదలయింది. అయితే సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ కథనం మాటలు అందిస్తూ ఉండటంతో సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. రఘుబాబు, బ్రహ్మాజీ లాంటివాళ్ళు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం అంటే సుమారు నెల క్రితం టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

పవన్ ఫాన్స్ హ్యాపీ కానీ

పవన్ ఫాన్స్ హ్యాపీ కానీ

"భీమ్లా నాయక్" అనే టైటిల్ ను ప్రకటిస్తూ లుంగీలో పవన్ లుక్ రివీల్ అయ్యేలాగా వీడియోను విడుదల చేశారు. ఇక ఎప్పటిలాగానే వీడియోలో పవర్ స్టార్ దుమ్మురేపాడనుకోండి. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగలా అనిపించినా సరే ముందు నుంచీ మల్టీ స్టారర్ అంటున్నారు కానీ రాణాకు సరైన ప్రాధ్యాన్యత ఇవ్వడం లేదనే వాదన వినిపించింది. రానాను ఇప్పటిదాకా ఎలాంటి ప్రమోషనల్ కార్యక్రమాల్లో చూపడం లేదు అని రానా ఫ్యాన్స్ తెగ బాధ పడ్డారు. ఎందుకంటే దీని మాతృక అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే ఒక మల్టీ స్టారర్ చిత్రం పవర్‌స్టార్ ఇమేజ్ పేరుతో సోలో ఫిల్మ్‌గా మారడం చూసి వారంతా నిరాశ చెందడమే కాకా నిర్మాతను అప్పట్లో టార్గెట్ చేశారు కూడా.

అందులో అలా

అందులో అలా

అయ్యప్పనుం కోశియుమ్ అనే మళయాళ సినిమా విషయానికి వెళ్తే స్క్రీన్ షేర్ చేసుకోవడం మొదలు టైటిల్ దాకా అన్ని విషయాల్లోనూ రెండు పాత్రలకు సమన ప్రాధాన్యత ఇచ్చారు. కానీ భీమ్లా నాయక్ టైటిల్ ప్రకటన మొదలు ఫస్ట్ గ్లింప్స్ లో కూడా పవన్ కే ప్రాధాన్యత ఇచ్చారు. రానా కూడా పవన్ అంత కాకపోయినా స్టార్ హీరోనే కానీ ఇప్పటి వరకు కేవలం పవన్ పేరునే వాడుతున్నారు కానీ అసలు ఒక ఫోటో కానీ లుక్ కానీ లేదు. ఈ క్రమంలోనే అసలు ఇంతకీ ఇది మల్టీస్టారర్ సినిమా ? అనే అనుమానం కూడా రానా ఫాన్స్ వ్యక్తం చేశారు. సినిమాలో పవన్ ను హీరోను చేసి రానాని విలన్ ను చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోందని కూడా రానా అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్న క్రమంలో అప్పట్లో ఒక జర్నలిస్ట్ కూడా అదే అర్థం వచ్చేలాగానే స్పందించడంతో నిర్మాత నాగ వంశీ వివరణ ఇచ్చారు.

Recommended Video

Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
మాట నిలబెట్టుకుని

మాట నిలబెట్టుకుని

"దయచేసి వేచి ఉండండి, ఎలాంటి నిర్ధారణలకు రావద్దు, అన్నీ ఆర్డర్ ప్రకారంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆయన అన్నట్టుగానే మాట నిలబెట్టుకుంటున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ఈ సినిమా నుంచి రానా లుక్ విడుదల చేయడానికి టీం టైం ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని కొద్ది సేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు సెప్టెంబర్ 20వ తేదీన డానియల్ శేఖర్ బ్లిట్జ్ విడుదల చేయబోతున్నాం అంటూ అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. దీంతో ఒక రకంగా దగ్గుబాటి రానా ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతున్నాయి. నిజానికి కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి కొన్ని సీన్స్ లీక్ కాగా అందులో రానా నటన ఆసక్తికరంగా అనిపించింది. దీంతో రానా ఫ్యాన్స్ రానా పరిచయ వీడియో ఎలా ఉండబోతోంది అనే దాని మీద అంచనాలు పెంచేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X