ఈరోజు నా పెళ్లామ్ బర్త్‌డే.. సో నాకు హాలిడే: దగ్గుబాటి రానా పోస్ట్ వైరల్

విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా. మొన్నటి వరకూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న అతడు.. కొన్ని నెలల క్రితం మిహీక బజాజ్ అనే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు, త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వెల్లడించాడు. అందుకు అనుగుణంగానే లాక్‌డౌన్ సమయంలో అంటే 2020 ఆగస్టు 8న మిహీక బజాజ్‌ను పెద్దల సమక్షంలో పెళ్లాడాడు. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు 30 మంది మాత్రమే అతిథులు హాజరయ్యారు.

వివాహం తర్వాత సినిమా షూటింగ్‌లతో బిజీ అయిపోయాడు దగ్గుబాటి రానా. ఈ నేపథ్యంలో శనివారం అతడి భార్య మిహీక బజాజ్ పుట్టినరోజును జరుపుకుంటోంది. దీంతో భార్యగా మొదటి పుట్టినరోజు జరుపుకుంటోన్న ఆమెకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడట ఈ టాలీవుడ్ హంక్. ఇందుకోసం అర్ధరాత్రి ఆమెతో కేక్ కట్ చేయించిన రానా.. మరిచిపోలేని గిప్ట్‌ను కూడా ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం తన భార్య పుట్టినరోజును పురస్కరించుకుని తన సోషల్ మీడియాలో ఆ ఫొటోలను షేర్ చేసి 'ఈరోజు నా పెళ్లామ్ బర్త్‌డే.. సో నాకు హాలిడే' అని క్యాప్షన్ పెట్టాడు. రానా చేసిన పోస్టుకు అద్భుతమైన స్పందన వస్తోంది.

Rana Daggubati Celebrate his Wife Miheeka Bajaj Birthday

ప్రస్తుతం రానా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' అనే సినిమాలో నటిస్తున్నాడు. రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్‌తో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. 1990వ దశకం నాటి ప్రేమ కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో రానా కామ్రెడ్ రవన్నగా నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటు 'హాతీ మేరా సాతీ' అనే సినిమాలోనూ నటించాడు రానా. ఇది తెలుగులో 'అరణ్య'గా రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X