Who is Miheeka Bajaj: రానా దగ్గుబాటి లవర్ ఎవరు.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటంటే!
ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌కు సంబంధించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో రానా ఒకరు. అయితే రానా గురించి పలు మార్లు అఫైర్లు, డేటింగ్ వార్తలు వచ్చినా అఫిషియల్‌గా ఎన్నడూ స్పందించలేదు. కానీ తాజాగా తన లవ్ ప్రపోజల్‌ను నా ప్రేయసి అంగీకరించారని చేసిన పోస్టు సోషల్ మీడియాను షేక్ చేసింది. రానా ప్రేమలో పడ్డారనే వార్త సోషల్ మీడియాను కుదిపేసింది. దాంతో సమంత, రాంచరణ్ లాంటి సెలబ్రిటీలంతా అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకు మిహికా బజాజ్ ఎవరంటే..
Recommended Video

త్రిషతో అఫైర్లకు తెర
రానాకు త్రిషాకు అఫైర్ ఉందనే విషయం బహిరంగ వాస్తవమే. పలు సందర్భాల్లో స్నేహం కంటే ఎక్కువగా రిలేషన్ ఉందనే విషయాన్ని రానా అంగీకరించారు. అయితే త్రిషా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత వారిద్దరూ క్లోజ్‌గా ఉంటున్నారనే వార్తలు వచ్చాయి. అయితే బాల్యం నుంచి వారిద్దరి మధ్య క్లోజ్ రిలేషన్ తప్ప మరోటి కాదనే విషయాన్ని సన్నిహితులు కొట్టిపడేశారు. త్రిషతో రిలేషన్‌పై వస్తున్న రూమర్లకు రానా ఎట్టకేలకు తెర దించడం గమనార్హం.

చాలా సీక్రెట్‌గా లవ్ ట్రాక్
రానా దగ్గుబాటి తన ప్రేమ వ్యవహారాన్ని చాప కింద నీరులా దాచిపెట్టారు. మూడో కంటికి తెలియకుండా చాలా సీక్రెట్‌గా నడిపించారు. గతేడాది జరిగిన పరిచయం ప్రేమగా మారిందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ ప్రేమ వ్యవహారం బయటకు పొక్కడం ఆలస్యమైందని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా మిహికా బజాజ్ వ్యవహారాన్ని రానా చాలా జాగ్రత్తగా డీల్ చేసినట్టు కనిపిస్తున్నది. ఏది ఏమైనా రానా ఎంగేజ్ కావడం తన స్నేహితులు, సన్నిహితులను సంతోషంలో ముంచెత్తింది.

మిహికా పక్కా హైదరాబాదీ..
మిహికా బజాజ్ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. కాకపోతే ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతున్నారు. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో అనే కంపెనీకి వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. ముంబై, హైదరాబాద్‌లో వెడ్డింగ్ ప్లానర్‌గా సుపరిచితులు. 2018 నుంచి ఈ వ్యాపారంలో ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖులతో క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. ముంబైలో జరిగే పలు పార్టీలలో మిహికా బజాజ్ సినీ తారలతో పాలుపంచుకొన్న సందర్బాలు చాలా ఉన్నాయి.

లాక్‌డౌన్ తర్వాత వెడ్డింగ్ బెల్స్
ఇక రానా, మిహికా బజాజ్ ప్రేమకు రెండు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. త్వరలోనే రానా, మిహికా నిశ్చితార్థం జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత వారిద్దరి పెళ్లికి ముహుర్తాలు పెట్టే దిశగా కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

రానా కెరీర్ విషయానికి వస్తే..
ఇక రానా దగ్గుబాటి కెరీర్ విషయానికి వస్తే.. ఆయన నటించిన హథీ మేరి సాథీ చిత్రం పలు భాషల్లో రిలీజ్ కానున్నది. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సింది. కానీ కొవిడ్ కారణంగా వాయిదా పడంది. ఇక తెలుగులో వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న విరాటపర్వం చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా నం. 1 యారీ విత్ రానా సీజన్ 3 అనే సెలబ్రిటీ షోను నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











