విరాట పర్వం ఫస్ట్ గ్లింప్స్: కామ్రేడ్ విరన్నగా రానా.. అంచనాలు పెంచేశాడు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలతో ఎక్కువగా ఆకట్టుకునే నటులలో రానా దగ్గుబాటి ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ తో కూడా సినిమా స్థాయిని పెంచగల ఈ టాలెంటెడ్ నటుడు నెక్స్ట్ మరో వండర్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. 1990ల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా తెరకెక్కితున్న సినిమా విరాటపర్వం.
నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాయి పల్లవి మెయిన్ లీడ్ లో నటిస్తుండగా రానా దగ్గుబాటి.. కామ్రేడ్ వీరన్న అనే ఒక నక్సల్ లీడర్ గా కనిపించబోతున్నాడు. ఈ రోజు రానా పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసింది. లుక్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశాడు ఈ బాహుబలి యాక్టర్.

ఎక్కడ తగ్గకుండా దర్శకుడు రానా స్థాయికి తగ్గట్టుగా చూపించినట్లు చాలా క్లియర్ గా అర్ధమవుతోంది. దేశం ముందు ప్రశ్నగా నిలబడిన జీవితం అతనిది. సత్యాన్వేషణలో నెత్తురోడిన జీవితం అతనిది. Dr. రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న.. అంటూ ఫస్ట్ టీజర్ లో అతని పాత్రను హైలెట్ చేసి చూపించారు. ఈ చిన్న టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ప్రియమణి కూడా ఈ సినిమాలో ఒక లేడి నక్సలైట్ పాత్రలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











