విరాట పర్వం నుంచి అప్‌డేట్.. రానా లుక్ రాబోతోంది!!
ఒక్క సినిమా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సినిమా టైటిల్ దగ్గరి నుంచి ప్రతీ ఒక్క విషయంలో అందర్నీ కట్టిపడేస్తోంది. విరాటపర్వం అనే టైటిల్ అందరినీ ఆకట్టుకుంటుంటే.. అందులో రానా, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్ వంటి గొప్ప యాక్టర్స్ నటించడంతో అందరి దృష్టిపై విరాటపర్వంపై పడింది. తాజాగా మరో అద్భుతమైన నటి నివేదా పేతురాజ్ విరాటపర్వంలో యూనిట్‌లోకి చేరింది.
ఇలా క్యాస్టింగ్, పోస్టర్లతో విరాటపర్వం టాలీవుడ్‌ను ఆకట్టుకుంది. నీదీ నాదీ ఒకే కథ వంటి మనసుకు హత్తుకునే చిత్రాన్ని తీసి వేణు ఊడుగుల అందర్నీ తన వైపుకు తిప్పుకున్నాడు. మళ్లీ వేణూ ఊడుగుల కథకు, పాత్రలకు మాత్రమే ప్రాధాన్యమున్న చిత్రాన్ని తెరకెక్కిస్తూ అందరిని కట్టిపడేసేందుకు సిద్దమయ్యాడు. తాజాగా విరాటపర్వం నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు సాయి పల్లవి, ప్రియమణి పాత్రలను పరిచయం చేసిన యూనిట్.. ఇకపై అసలు పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను బయటకు తీసుకురానున్నారు.

విరాటపర్వం నుంచి రానా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. రానా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిసెంబర్ 14న ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విరాటపర్వం సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











