రంగంలోకి రానా.. నా గురించి నేనే చెప్తా.. ఎవ్వరు చెప్పినా అందులో నిజం ఉండదంటూ!
దగ్గుబాటి రానా ఆరోగ్యం గురించి గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు ఆయన అభిమానులను కలవర పెడుతున్నాయి. రోజు రోజుకూ ఆయన ఆరోగ్య పరిస్థితులపై సరికొత్త కథనాలు పుట్టుకొస్తుండటంతో.. ఏకంగా ఆయనే రంగం లోకి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. తన గురించి తానే చెప్తానని, ఎవ్వరు చెప్పినా నమ్మొద్దని అంటూ ట్వీట్ పెట్టాడు.
రానా ఆరోగ్యంపై కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తుండటం, వాటిపై ఎవరూ క్లారిటీ ఇవ్వక పోవడంతో అవి క్రమంగా ముదిరాయి. దీనికి తోడు కొన్ని రోజులుగా రానా ఇండియాలో లేకపోవడం పలు అనుమానాలకు తెరలేపింది. ఆయన తన అనారోగ్యానికి చికిత్స పొందేందుకే విదేశాలకు వెళ్లారని ప్రచారం జరిగింది. అయితే ఇటీవలే తిరిగి ఇండియా చేరుకున్న ఆయన.. తన ఆరోగ్య పరిస్థితులపై వస్తున్న వార్తలను ఖండించారు.

ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో అనారోగ్యం వార్తలపై స్పందించిన రానా.. ఆల్రైట్, ఆన్‌లైన్‌లోకి లోకి వచ్చాను.. మరికొన్ని గంటల్లో ఇండియాలో వస్తున్నానంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దానికి కొనసాగింపుగా తన ట్విట్టర్ ద్వారా మరో సంచలన ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లన్నింటికీ ఈ ఒక్క ట్వీట్‌తో సమాధానం చెప్పేశారు దగ్గుబాటి రానా. ''అది నా గురించి అయ్యుండి. నేను చెప్పకపోతే.. అది అబద్ధమే'' అంటూ ట్వీట్ పెట్టారు. రానా ట్వీట్‌పై స్పందించిన అభిమానులు మ్యాటరేంటి అని కామెంట్ చేయగా.. 'సోది మ్యాటర్ ఎక్కువైంది' అని రిప్లై ఇచ్చి షాక్ ఇచ్చారు రానా. టాలీవుడ్ సహా బాలీవుడ్ సినిమాల్లోనూ సత్తా చాటుతున్న రానా.. ఇటీవలే హౌస్ ఫుల్ 4 సినిమా పూర్తి చేశారు. తెలుగులో 'విరాటపర్వం' సినిమాలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











