For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బంపర్ ఆఫర్ పట్టేసిన సమంత.. తెర వెనుక చక్రం తిప్పిన యంగ్ హీరో

  By Manoj
  |

  వరుస విజయాలతో దూకుడు మీదుంది అక్కినేని వారి కోడలు సమంత. పెళ్లికి ముందు ఎన్నో ఫ్లాపులను చూసిన ఆమె.. ఆ తర్వాత మాత్రం అస్సలు ఆగడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం'లో అద్భుతమైన నటన కనబరిచిన ఆమె.. ఆ తర్వాత 'మహానటి', 'యూటర్న్'లో మంచి మార్కులు కొట్టేసింది. ఇక, ఇటీవల విడుదలైన 'ఓ బేబి'తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుస హిట్‌లను సొంతం చేసుకుంటున్న సమంత.. ఇటీవల ఓ ఆఫర్ దక్కించుకుంది. దీనికి కారణం టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో అని తాజాగా ఫిలిం నగర్ సర్కిళ్లలో ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఆమెకు వచ్చిన ఆఫర్ ఏంటి..? ఏ హీరో వల్ల ఇది సాధ్యం అయింది.?

   అది కంప్లీట్ చేసేసింది

  అది కంప్లీట్ చేసేసింది

  ‘ఓ బేబి' తర్వాత సమంత నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. దీని తర్వాత ఆమె ఎన్నో సినిమాలు ఒప్పుకుంటుందని ప్రచారం జరిగింది. కానీ, సమంత మాత్రం అలా చేయలేదు. కేవలం ఒకే ఒక్క సినిమాకు సంతకం చేసింది. అది కూడా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96' తెలుగు రీమేక్ మాత్రమే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది.

  బయోపిక్ చేస్తుందన్నారు

  బయోపిక్ చేస్తుందన్నారు

  భారత స్టార్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు బయోపిక్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నటుడు సోనూ సూద్‌ నిర్మిస్తారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సోనూ భావిస్తున్నారు. కానీ, సింధు పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే, ఈ సినిమాలో సమంత నటించబోతుందని ప్రచారం జరిగింది. చిత్ర బృందం ఆమెను సంప్రదించిందని కూడా వార్తలు వచ్చాయి. తర్వాత ఇందులో నిజం లేదని స్పష్టమైంది.

  బంపర్ ఆఫర్ పట్టేసింది

  బంపర్ ఆఫర్ పట్టేసింది

  అక్కినేని వారి కోడలు సమంత వెబ్ సిరీస్‌లో నటించబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చింది. మ‌నోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై థ్రిల్లర్ ‘ది ఫ్యామిలీ మ్యాన్' ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైంది. మొత్తం 10 ఎపిసోడ్లతో కూడిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాపులర్ హిందీ వెబ్ సిరీస్‌కు ఇప్పుడు సీక్వెల్‌ను తీస్తున్నారు. అదే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2'. ఇందులో సమంత ఆఫర్ దక్కించుకుంది.

  Title : #CineBox : #SarileruNeekevvaruTeaser | #OMGDaddy Song | Ragala 24 Gantallo Movie Review
  భారీ రెమ్యూనరేషన్

  భారీ రెమ్యూనరేషన్

  ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గానూ సమంత భారీ మొత్తాన్ని రెమ్యూనరేషన్‌గా అందుకోనుందని ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం ఇందులో సమంత చేసేది నెగెటివ్ రోల్ కావడమేనని సమాచారం. అది కూడా టెర్రరిస్ట్ కేరెక్టర్ అని సమాచారం. స్పై థ్రిల్లర్‌గా వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సమంత పాత్రకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుందట. అందుకే ఆమె దీనిని ఒప్పుకుందని కూడా టాక్ వినిపిస్తోంది. గతంలో ఆమె విక్రమ్ నటించిన ‘10' అనే సినిమాలో నెగెటివ్ పాత్ర చేసిన విషయం తెలిసిందే.

  English summary
  Directors Raj and DK, who made their digital debut with Amazon Prime’s The Family Man, are enjoying the accolades coming their way. The Manoj Bajpayee, Neeraj Madhav, Priyamani, Sharib Hashmi starrer has received largely good reviews from audience and critics alike.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X