హాలీవుడ్ సినిమాలో నటించబోతున్న రానా దగ్గుబాటి?
సినిమా కుటుంబం నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రానా దగ్గుబాటి.. బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. రోటీన్ సినిమాలు కాకుండా భిన్నమైన కాన్సెప్టులు ఎంచుకుంటూ కెరీర్లో ఎదుగుతున్నాడు.
కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా బాలీవుడ్, ఇతర ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ రానా అవకాశాలు దక్కించుకుంటున్నారు. త్వరలో ఈ తెలుగు స్టార్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ హాట్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.

ఓ హాలీవుడ్ సినిమాలో పాత్ర కోసం కొందరు ఆయన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అంతా సవ్యంగా సాగితే రానా త్వరలో హాలీవుడ్ మూవీ సైన్ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం రానా 'హాథీ మేరీ సాతీ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళంలో రూపొందుతోంది. దీంతో పాటు బాలీవుడ్ చిత్రం 'హౌస్‌ఫుల్ 4' మూవీలో కూడా రానా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











