కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకో.. రానాకు సోనమ్ కపూర్ వార్నింగ్
బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన రానా... మొత్తానికి ఓ ఇంటివాడైపోతున్నాడు. ఈ ముచ్చటను ఇటీవలే ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్న భళ్లాలదేవుడు... అమ్మాయి... "యెస్" అనేసిందోచ్ అంటూ సంబరపడిపోతున్నాడు. ఇక ఈ వార్త టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. సినీ జనాలందరూ... కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతే కాదు... ఎప్పుడెప్పుడు పప్పన్నం పెట్టేస్తారా అంటూ... ఎదురుచూపులు మొదలయ్యాయి.

రాన్ ఫ్యాన్స్ పండుగ
ఇక రానా ఫ్యాన్స్ మాత్రం... ఫుల్ గా పండగ చేసుకుంటున్నారు. అయితే.. ఫిమేల్ ఫ్యాన్స్ మాత్రం కాస్తంత నొచ్చుకున్న మాట కూడా వాస్తవమేననుకోండి. ఏమైనా... మొత్తానికి... లేటువయసులో అడుగుపెట్టక ముందే అబ్బాయి బ్యాచిలర్ లీగ్ నుంచి తప్పుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. మన డార్లింగ్ ప్రభాస్ మాత్రం... ఈ బ్రహ్మచారుల సంఘానికి ఇంకా అధ్యక్షుడిగానే కొనసాగుతున్నాడు.

సోనమ్ కపూర్ స్ట్రాంగ్ వార్నింగ్
మరోవైపు... రానా పెళ్లి ముచ్చట గురించి అందరూ శుభాకాంక్షలు గుమ్మరిస్తుంటే... ఓ సుందరాంగి మాత్రం అబ్బాయికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు సుమా...! బాలీవుడ్ ఫ్యాషనిస్టాగా పేరుగాంచిన సోనమ్ కపూర్... రానా పెళ్లి వార్త తెలియగానే... కాస్తంత ఒళ్లు దగ్గరపెట్టుకోవోయ్ అంటూ... హెచ్చరించింది...

మిహికా బజాజ్‌తో సోనమ్‌కు
అదేంటి వీరిద్దరూ ఒక్క సినిమాలో కూడా కలసి పనిచేసిన జాడలు లేవే... మరి.. ఇంతలోనే అమ్మాయి అంత పెద్ద మాట ఎలా అనేసిందబ్బా...! అన్న డౌట్ అందరి మెదళ్లను తొలిచేస్తోంది. అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే... రానా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మిహికా బజాజ్... సోనమ్ కపూర్ కు చాలా ప్రియమైన చెల్లెలు లాంటింది. అక్కడే అమ్మడు అక్కగా తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలని ఫిక్స్ అయింది. అందుకే... ముందు జాగ్రత్తగానే రానాకు వార్నింగ్ ఇచ్చేసింది.
Recommended Video

పెళ్లి వార్త తెలియగానే..
పెళ్లి వార్త తెలియగానే... రానా, మిహికా బజాజ్‌కు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలియజేసిన సోనమ్... అబ్బాయి నిన్ను జాగ్రత్తగానే చూసుకోవాలి సుమా...! అంటూ వ్యంగ్యాన్ని జోడించింది. దీంతో సోనమ్ ట్వీట్ వైరల్ గా మారింది. ఏమైనా... ఈ కొత్త జంట... టాలీవుడ్ కు కొత్త కళను తీసుకువస్తుంది అనడంలో సందేహమే లేదు.


Click it and Unblock the Notifications











