ఆ దర్శకుడితో మరోసారి రానా మూవీ.. ఊహించని పాత్రతో మల్టీ స్టారర్.. టైటిల్ ఏంటంటే?
అగ్ర కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి సెలెక్టివ్ గా సినిమాలు చేసుకంటూ తనదైన ముద్ర వేసుకున్నాడు. లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రానా అప్పట్లోనే హిందీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకున్నాడు. ఓవైపు హీరోగా.. మరోవైపు విలన్ గా కూడా మెప్పిస్తూ వర్సటైల్ యాక్టర్ అనిపించుకుంటున్నాడు. ఇటీవల రానా నాయుడు వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా తన తర్వాతి చిత్రంపై క్రేజీ బజ్ క్రియేట్ అవుతోంది.
శేఖర్ కమ్ములతో:శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాతో సినీ కెరీర్ మొదలు పెట్టిన దగ్గుబాటి రానా నటనతో ఆకట్టుకున్నాడు. తర్వాత వెంటనే దమ్ మారో దమ్ అనే హిందీ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఇలా తెలుగులో ఒక సినిమా చేసిన వెంటనే బాలీవుడ్ మూవీస్ చేసిన హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు రానా దగ్గుబాటి.

తెలుగు-హిందీ :అనంతరం తెలుగులో నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుం, ఆరంభం, రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, నేనే రాజు నేనే మంత్రి, ఎన్టీఆర్ కథానాయకుడు, అరణ్య, భీమ్లా నాయక్, విరాట పర్వం వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు రానా. డిపార్ట్ మెంట్, యే జవానీ హై దివానీ, సమ్ థింగ్ సమ్ థింగ్, వెల్ కమ్ టు న్యూయార్క్, హౌజ్ ఫుల్ 4 వంటి హిందీ చిత్రాల్లో సైతం మెప్పించాడు.

శృంగార సన్నివేశాలు:ఇక ఇటీవలే రానా దగ్గుబాటి బాబాయ్ వెంకటేష్ తో కలిసి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలైన రానా నాయుడు సిరీస్ పర్వాలేదనిపించుకుంది. కానీ ఈ సిరీస్ పై నెగెటివిటీ కూడా బాగానే వచ్చింది. ఇందులో వెంకటేష్ బూతులు మాట్లాడటం, శృంగార భరిత సన్నివేశాలతో పలు విమర్శలు తెచ్చుకుంది.

త్వరలో షూటింగ్:అయితే ఇప్పుడు రానా నటించే కొత్త సినిమాపై క్రేజ్ నెలకొంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి విజయం అందుకున్న రానా మరోసారి ఆ మూవీ డైరెక్టర్ తేజతో సినిమా చేయనున్నట్లు టాక్ వస్తుంది. హీరో రానా-డైరెక్టర్ తేజ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. ఈ సినిమా స్క్రిప్ట్ కు రానా ఓకే చేసినట్లు టాక్. త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

మలయాళ స్టార్ హీరో:నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా చేసిన జోగేంద్ర పాత్రకు మరింత బలంగా ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్షస రాజు అని టైటిల్ కూడా పెట్టినట్లు ప్రచారం సాగింది. అంతేకాకుండా ఇందులో మలయాళ స్టార్ హీరో కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం.

జూన్ 2న రిలీజ్:రానా-తేజ కాంబినేషన్ లో వస్తున్న ఈ రెండో సినిమాను గోపినాథ్ ఆచంట నిర్మిస్తున్నారు. ఆయన టాప్ హీరో, దేవుడు, జంబలకిడి పంబ, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ వంటి సినిమాలను నిర్మించారు. కాగా గత కొంతకాలంగా తేజ సినిమాలు తెరకెక్కించట్లేదు. కానీ ప్రస్తుతం అహింస అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ జూన్ 2న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











