ఓ వైపు పెళ్లి పనులు.. మరోవైపు ఓటీటీ బిజినెస్.. రానా ఫుల్ బిజీ!
కేవలం హీరోగానే కాకుండా ఒక నటుడిగా కూడా డిఫరెంట్ గా ప్రయోగాలు చేసే రానా దగ్గుబాటి నెక్స్ట్ ఇక ఓటీటీ బిజినెస్ తో కూడా బిజీ కానున్నాడు. ఇదివరకే ఒక ట్రయల్ వేసి సక్సెస్ అయిన రానా భవిష్యత్తులో మరిన్ని వెబ్ సిరీస్ లతో రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన చర్చల్లో కూడా బిజీగా పాల్గొంటున్నారు.
ఇక మరోవైపు పెళ్లి పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. రానా తన ప్రేయసి మిహికా బజాజ్ ని పెళ్లాడబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్లాన్స్ కూడా రెడీ అయ్యాయి. ఇక వాటిని ఆచరణలో పెట్టాల్సిన పని ఉంది. దాదాపు పెళ్లి పత్రికలు కూడా సిద్ధమయ్యాయి. అయితే పెళ్లి పనుల్లో ఓ వైపు బిజీగా ఉంటూనే రానా ఓటీటీ బిజినెస్ గురించి స్పెషల్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

నెట్ ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలతో కలిసి త్వరలోనే ఒక డీలింగ్ సెట్ చేసుకోబోతున్నట్లు సమాచారం. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల వారిని ఆకట్టుకునే విధంగా వెబ్ కంటెంట్స్ ని డెవలప్ చేయిస్తున్నాడట. ఒక స్పెషల్ టీమ్ ని సిద్ధం చేసిన రానా కొత్తగా వెబ్ సిరీస్ కోసం కథలు వస్తే వెంటనే తన దగ్గరకు తీసుకురావాలని చెబుతున్నాడట. ఎక్కువగా ప్రొడక్షన్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్న రానా వాటిలో నటిస్తాడా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
భవిష్యత్తులో ఎక్కువగా ఓటీటీల హవా నడుస్తుందని ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కామెంట్స్ చేశారు. జనాలు థియేటర్స్ కి రావడం తగ్గుతుందని కూడా చెబుతున్నారు. అందుకే రానా ముందు జాగ్రత్తగా సురేష్ ప్రొడక్షన్ కొన్ని వెబ్ సిరీస్ లతో బిజీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











