ఫుల్ బోల్డ్ కంటెంట్‌తో లవ్ లైఫ్ అండ్ పకోడీ.. రానా చేతుల మీదుగా ట్రైలర్
కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మధురా శ్రీధర్ రెడ్డి సమర్పణలో దర్శకుడు జయంత్ గాలి రూపొందించిన చిత్రం లవ్ లైఫ్ అండ్ పకోడీ. హీరో హీరోయిన్లకిది తొలి చిత్రం. ఈ చిత్రంలో కార్తిక్ బిమల్ రెబ్బ , సంచిత పొనాచ జంటగా నటించారు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. ట్రైలర్ బాగుంది. ఈ సినిమాలో నటించిన వారందరికీ నా బెస్ట్ విషెస్ అని రానా అన్నారు.
నేటి యువత అభిరుచులు, ఆలోచనలకు అద్దం పట్టే అంశాలతో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమా లవ్ లైఫ్ అండ్ పకోడీ. ప్రేమ, పెళ్లి అంశాల మధ్య నలిగిపోయే యువతకు ఆ రెండు ఎలాంటి సమస్యగా మారాయనేది ఈ సినిమా కథా నేపథ్యం. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకులకు ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నది.

'మా మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువ రిలేషనే', అరుణ్‌కు 16 ఏళ్ల వయసులోనే ఆంటీతో సెక్స్ చేశాడు. ఈ లవ్ ఏంటీ; మ్యారేజ్ ఏంటి? పెళ్లి చేసుకొంటే ఏమోస్తుంది బొచ్చు తప్పా లాంటి బోల్డ్ కంటెంట్, డైలాగ్స్‌తో యువతను ఆకట్టుకునేలా లవ్, లైఫ్ అండ్ పకోడి ట్రైలర్‌ను రూపొందించారు.

నటీనటులు: ఆకర్ష్ రాజ్ భాగవతుల, క్రిష్ణ హాబ్బల్ , కళా జ్యోతి , అనురాధ మల్లికార్జున తదితరులు
డిఓపి: సాగర్ వైవివి జతిన్ మోహాన్
మ్యూజిక్: పవన్
ఎడిటర్: శ్రవన్ కటికనేని
ఆర్ట్: దండు రెంజీవ్
పిఆర్వో: జియస్ కె మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట సిద్దారెడ్డి
సమర్సణ: మధుర శ్రీధర్ రెడ్డి
నిర్మాత, రచన, దర్శకత్వం: జయంత్ గాలి


Click it and Unblock the Notifications











