Jwala teaser విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్ పవర్‌పుల్ పాత్రల్లో.. టీజర్ వైరల్

RRR, KGF Chapter 2, విక్రమ్‌ లాంటి పాన్‌ ఇండియా చిత్రాల సరసన చేరేందుకు జ్వాల మూవీ సిద్ధమైంది. విజయ్‌ఆంటోనీ, అరుణ్‌ విజయ్‌ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రానా దగ్గుబాటి ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకొన్నది. గంభీరమైన గొంతుతో తెరమీద కనిపించే సన్నివేశాలను గురించి విశ్లేషిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ మనిషి కథలా చెప్తూ ఉంటారు. 'సాహో' ఫేమ్‌ అరుణ్‌ విజయ్, 'బిచ్చగాడు' ఫేమ్‌ విజయ్‌ ఆంటోని టీజర్‌లో పోటాపోటీగా నటించారు. అక్షరహాసన్‌ కీలక పాత్రలో కనిపిస్తారు.

ప్యాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకొన్న జ్వాల మూవీని అమ్మ క్రియేషన్స్‌ టీ శివ సమర్పించారు. శర్వాంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి మూవీస్‌ పతాకంపై యం.రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారు. రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, స్విట్జర్లాండ్, కలకత్తాలతో పాటు అనేక దేశాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంది.

 Rana Daggubati released Vijay Anthony, Arun Vijays Jwala teaser

పాత రోమ్‌ నగరం గుర్తుందా మిత్రుడా! ఇద్దరు గ్లాడియేటర్స్‌ తలపడతారు, ఓడినవాడు చస్తాడు గెలిచినవాడు మాత్రమే బ్రతుకుతాడు...బతికుంటే అలాంటి ఒక గెలుపుతో బతికుండాలి. చచ్చినాకూడా అలాంటి వాడి చేతిలో చచ్చాము అనే గర్వంతో చావాలి...''. ఇలాంటి పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో జ్వాల చిత్ర టీజర్‌ విశేషంగా ఆకట్టుకొన్నది.

నటీనటులు: అరుణ్‌ విజయ్, విజయ్‌ ఆంటోనీ, అక్షరహాసన్‌, ప్రకాశ్‌రాజ్, రైమాసేన్, నాజర్‌ తదితరులు
దర్శకత్వం: నవీన్‌
కెమెరా: కేఏ బచ్చ
ఎడిటర్‌: వెట్రికృష్ణన్
సంగీతం: నటరాజన్‌ శంకరన్‌
పీఆర్‌వో: శివమల్లాల

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X