‘చక్ర’ ట్రైలర్ : సైబర్ క్రైమ్, దొంగతనం.. దాని కోసం విశాల్ పరుగు
విశాల్ తుప్పరివాలన్ (డిటెక్టివ్), అభిమన్యు (ఇరుంబుదురై), అయోగ్య, పందెంకోడి 2 వంటి వరుస చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం విశాల్ సినిమా వస్తుందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమాజాన్ని అప్రమత్తం చేసేలా ఏదో ఒక కొత్త పాయింట్‌తో విశాల్ సినిమాలను తెరకెక్కించడంతో సక్సెస్ సాధిస్తున్నాడు. మరోసారి అలాంటి ఓ విభిన్న ప్రయోగమే చేయబోతోన్నాడు.
ప్రస్తుతం విశాల్ చక్ర అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మధ్య ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. గతంలో వచ్చిన సినిమాల మాదిరిగా సైబర్ క్రైమ్, రాబరీ కాన్సప్ట్‌లతో చక్ర సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నాడు. తాజాగా చక్ర ట్రైలర్‌ను దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్ చేశాడు. తెలుగులో ఈ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశాడు.

బ్యాంక్‌లో దొంగతనం, సైబర్ క్రైమ్, మధ్యలో అశోక చక్ర పతాకం దొంగిలించ బడటం.. ఈ మూడు కాన్సెప్ట్‌ల చుట్టూ చక్ర తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. కనిపించకుండా పోయిన చక్ర అవార్డు కోసం మిలటరీ ఆఫీసర్ విశాల్ పెట్టే పరుగే ఈ సినిమా. శ్రద్దా శ్రీనాథ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించినట్టు తెలుస్తోంది. ఎంఎస్ ఆనందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.


Click it and Unblock the Notifications











