twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రానా అన్న.. నీకెవరైనా నో చెబుతారా? బ్రహ్మాజీని ఆటాడుకొన్న నెటిజన్లు

    |

    టాలీవుడ్ భల్లాళదేవుడు రానా దగ్గుబాటి ఏ ముహుర్తాన తన పెళ్లి గురించి తెలియజేస్తూ.. ప్రేయసి ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారో.. అప్పటి నుంచి ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ల మోత మోగుతున్నాయి. సెలబ్రిటీలందరూ ఆశ్చర్యపోతూనే రకరకాలుగా స్పందిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అందరూ రానాకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.

    తన ప్రేమను ప్రేయసి మిహికా బజాజ్ అంగీకరించడంపై రానా ట్విట్టర్‌లో ఆమె ఎస్ అన్నారు అంటూ ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ వైరల్ కావడం తెలిసిందే. రానా పెళ్లి వార్త జాతీయ స్థాయిలో ప్రధానాంశంగా మారింది. అయితే రానా ట్వీట్‌పై బ్రహ్మాజీ ఆసక్తికరంగా స్పందించారు.

    Rana Daggubati revealed Lover as Miheeka: Actor Brahmaji counters

    రానా అన్నా.. నాకు ఓ డౌటు. నీకు ఎవరైనా నో చెప్తారా అంటూ బ్రహ్మాజీ ప్రశ్నను సంధించారు. అయితే బ్రహ్మాజీ ట్వీట్‌కు రానా ఎలాంటి సమాధానం ఇవ్వకపోయినా.. నెటిజన్లు మాత్రం ఘాటుగా స్పందిస్తున్నారు. రానాను మీరు అన్నా అంటూ మీరు ఆయనకు తమ్ముడన్న మాట.. ద్యేవుడా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అలాగే రచయిత బీవీఎస్ రవి స్పందిస్తూ.. ట్వీట్ ఆఫ్ ది డే అంటూ కామెంట్ పెట్టారు. ఇలా బ్రహ్మాజీ ట్వీట్ కింద రకరకాల కామెంట్లతో సందడిగా మారింది.

    రానా ప్రేయసి మిహికా బజాజ్ ఇంటిరీయర్ డిజైనర్‌గా, అలాగే ముంబైలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఓనరుగా వ్యవహరిస్తున్నారు. పక్కా హైదరాబాదీ అయిన ఈ అమ్మాయి ముంబై, లండన్ నగరాల్లో విద్యను అభ్యసించారు.

    English summary
    Rana Daggubati revealed Lover as Miheeka: Actor Brahmaji counters
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X