Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రానా అన్న.. నీకెవరైనా నో చెబుతారా? బ్రహ్మాజీని ఆటాడుకొన్న నెటిజన్లు
టాలీవుడ్ భల్లాళదేవుడు రానా దగ్గుబాటి ఏ ముహుర్తాన తన పెళ్లి గురించి తెలియజేస్తూ.. ప్రేయసి ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారో.. అప్పటి నుంచి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మెసేజ్‌ల మోత మోగుతున్నాయి. సెలబ్రిటీలందరూ ఆశ్చర్యపోతూనే రకరకాలుగా స్పందిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అందరూ రానాకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.
తన ప్రేమను ప్రేయసి మిహికా బజాజ్ అంగీకరించడంపై రానా ట్విట్టర్లో ఆమె ఎస్ అన్నారు అంటూ ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ వైరల్ కావడం తెలిసిందే. రానా పెళ్లి వార్త జాతీయ స్థాయిలో ప్రధానాంశంగా మారింది. అయితే రానా ట్వీట్‌పై బ్రహ్మాజీ ఆసక్తికరంగా స్పందించారు.
రానా అన్నా.. నాకు ఓ డౌటు. నీకు ఎవరైనా నో చెప్తారా అంటూ బ్రహ్మాజీ ప్రశ్నను సంధించారు. అయితే బ్రహ్మాజీ ట్వీట్‌కు రానా ఎలాంటి సమాధానం ఇవ్వకపోయినా.. నెటిజన్లు మాత్రం ఘాటుగా స్పందిస్తున్నారు. రానాను మీరు అన్నా అంటూ మీరు ఆయనకు తమ్ముడన్న మాట.. ద్యేవుడా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అలాగే రచయిత బీవీఎస్ రవి స్పందిస్తూ.. ట్వీట్ ఆఫ్ ది డే అంటూ కామెంట్ పెట్టారు. ఇలా బ్రహ్మాజీ ట్వీట్ కింద రకరకాల కామెంట్లతో సందడిగా మారింది.
రానా ప్రేయసి మిహికా బజాజ్ ఇంటిరీయర్ డిజైనర్‌గా, అలాగే ముంబైలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఓనరుగా వ్యవహరిస్తున్నారు. పక్కా హైదరాబాదీ అయిన ఈ అమ్మాయి ముంబై, లండన్ నగరాల్లో విద్యను అభ్యసించారు.