twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లెజెండ్‌తో లెజెండరీ బయోపిక్.. రానా అఫీషియల్‌ స్టేట్‌మెంట్

    |

    Recommended Video

    Rana Says He Will Bankroll Muttiah Muralidharan's Biopic

    అన్ని భాషల్లో బయోపిక్స్ హవా కొనసాగుతోంది. 'మహానటి' సావిత్రి జీవిత కథ హిట్ అనంతరం దర్శక నిర్మాతల చూపు బయోపిక్స్ పైనే పడింది. ప్రముఖుల జీవిత కథలకు వెండితెర రూపమిచ్చి ప్రేక్షకాదరణ పొందేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు నేటి తరం దర్శకులు. ఈ నేపథ్యంలోనే శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ బయోపిక్‌కి సంబంధించి కొన్ని వార్తలు రాగా, దీనిపై మరింత క్లారిటీ ఇచ్చాడు దగ్గుబాటి రానా. ఆ వివరాలు చూద్దామా..

     దేశంలోనే మొదటి సారి

    దేశంలోనే మొదటి సారి

    ఇప్పటి వరకు ఎన్నో బియోపిక్స్ రూపొందించారు ఫిలిం మేకర్స్. అయితే అవన్నీ కూడా మన దేశానికి చెందిన వ్యక్తులవే. కానీ.. దేశంలోనే మొదటి సారి మరో దేశానికి చెందిన ఓ లెజెండ్ జీవిత చరిత్రను సినిమాగా మలచబోతున్నారు. దీంతో ఈ బయోపిక్ విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది.

    మురళీధరన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో

    మురళీధరన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మురళీధరన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించనున్నారు. ఇప్పటికే కథా పరమైన చర్చలు కూడా ముగిశాయి. ఇంకాస్త పెండింగ్ లో ఉన్న స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ కాగానే డిసెంబర్ నెలలో ఈ బయోపిక్ ని సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఈ మేరకు విజయ్ సేతుపతి క్రికెట్ కి సంబందించిన మెళకువలు కూడా నేర్చుకుంటున్నాడు.

    రానా అఫీషియల్‌ స్టేట్‌మెంట్

    రానా అఫీషియల్‌ స్టేట్‌మెంట్

    తాజాగా మురళీధరన్‌ బయోపిక్‌పై అఫీషియల్‌ స్టేట్‌మెంట్ ఇచ్చాడు దగ్గుబాటి రానా. ఈ సినిమాకు ఎం.ఎస్‌.శ్రీపతి దర్శకత్వం వహించనున్నాడని, దీనిని సురేష్ ప్రొడక్షన్స్‌, దార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయని తెలిపాడు. ఈ సినిమా నిర్మాణంలో తాను భాగం కానుండటం పట్ల గర్వంగా ఫీల్ అవుతున్నానని రానా పేర్కొన్నాడు.

    ముత్తయ్య మురళీధరన్ స్పందన

    ముత్తయ్య మురళీధరన్ స్పందన

    తన జీవిత కథకు వెండితెర రూపం రానుండటం పట్ల ముత్తయ్య మురళీధరన్ కూడా స్పందించారు. తన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనుండటం, విజయ్‌ సేతుపతి లాంటి హీరో అందులో నటించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ టీమ్‌‌కి తన వంతు సహకారం అందిస్తున్నానని ఆయన చెప్పారు. 2020 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానుంది.

    English summary
    Tamil star Vijay Sethupathi will essay Sri Lankan spin legend Muttiah Muralitharan in a biopic written and directed by MS Sripathy. The film is expected to be titled 800 — after number of wickets the former cricketer has in Tests, the most in history by any bowler.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X