రానా పుట్టినరోజు కానుక: సరికొత్త అవతారంలో దర్శనమిచ్చిన టాలీవుడ్ హంక్
సినీ బ్యాంగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా తనలోని అద్భుతమైన టాలెంట్లను బయట పెడుతూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు దగ్గుబాటి రానా. కెరీర్ ఆరంభంలో కొన్ని పరాజయాలను ఎదుర్కొన్న అతడు.. ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'లో భల్లాలదేవుడిగా నటించి ఔరా అనిపించాడు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో చాలా తక్కువ సినిమాల్లోనే నటించాడు. సుదీర్ఘ విరామం తర్వాత అతడు మరోసారి ముఖానికి మేకప్ వేసుకున్నాడు.
రానా ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'విరాట పర్వం'. వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్‌తో వస్తోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పున: ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో సోమవారం రానా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని అతడి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో అతడు నక్సలైట్‌గా కనిపిస్తున్నాడు. అతడి బ్యాగ్రౌండ్‌లో విప్లవ ఉద్యమాన్ని సూచించే జెండాలు కనిపిస్తున్నాయి.

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ అప్పుడెప్పుడో ప్రారంభం అయింది. రానా అందుబాటులో లేకపోవడంతో, అతడు లేని సీన్స్ చాలా వరకు షూట్ చేశారు. ఇక, ఈ మధ్య మొదలైన షెడ్యూల్‌లో అతడు పాల్గొంటున్నాడు. ఇందులో హీరోపైన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీని చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2021లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమా కోసం విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











