Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
‘విరాట పర్వం’ రిలీజ్‌పై అదిరిపోయే న్యూస్: ఆ విషయంలో వెనకడుగు వేసిన రానా టీమ్
కోవిడ్ కారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అందులో చాలా వరకూ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, కొన్ని చిత్రాలు మాత్రం ఇప్పటికీ రిలీజ్‌ను కన్ఫార్మ్ చేసుకోలేదు. అలాంటి మూవీల్లో 'విరాట పర్వం' ఒకటి. దగ్గుబాటి రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నాడు. సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను గత వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. కానీ, సెకెండ్ వేవ్ కారణంగా దీని విడుదలను వాయిదా వేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే.
హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: కేవలం అదొక్కటే ధరించి.. ఇలాంటి ఫొటోలు కూడా షేర్ చేస్తారా!
రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'విరాట పర్వం' మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తైంది. సెకెండ్ వేవ్ తర్వాత చివరి షెడ్యూల్‌ను ప్రారంభించి కొద్ది రోజుల్లోనే దాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే పూర్తైన టాకీ పార్ట్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి.. వాటిని కూడా వెంటనే కంప్లీట్ చేసుకున్నారు. అలాగే, మరికొన్ని పనులను మాత్రం పూర్తి చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా విడుదల గురించి చాలా రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. దీంతో అసలు ఇది ఎలా రిలీజ్ అవుతుందో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.

'విరాట పర్వం' సినిమాను లాక్‌డౌన్‌కు ముందే విడుదల చేయాలని భావించారు. కానీ, అనివార్య కారణాలతో అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా స్ట్రీమింగ్ చేయబోతున్నారన్న టాక్ కూడా వినిపించింది. అంతేకాదు, ఇప్పటికే నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన డీల్‌ను కూడా ఆ సంస్థతో క్లోజ్ చేసుకున్నారని అన్నారు. దీంతో రానా సినిమా ఓటీటీలోనే విడుదల కాబోతుందని అంతా ఓ అంచనాకు వచ్చేశారు. ఆ తర్వాత ఈ వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. కానీ, ఇప్పుడు మరోసారి ఇది ఓటీటీలోనే విడుదల కాబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
'అఖండ' ఈవెంట్‌కు ఇద్దరు హీరోలు: ఎన్టీఆర్‌తో పాటు బాలయ్య అభిమాని కూడా.. ఇక రచ్చ రచ్చే
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. 'విరాట పర్వం' చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని తెలుస్తోంది. అయితే, సరైన డేట్ అనుకున్న తర్వాత అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఇక, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో ఇది థియేటర్లలో విడుదలైన తర్వాత అందులో డిజిటల్ స్ట్రీమింగ్ జరుపుకోబోతుందని తెలుస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై ఈ వారంలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్యూర్ లవ్ స్టోరీతో రాబోతున్న 'విరాట పర్వం' చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల మేలవింపుతో రూపొందుతోన్న ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇక, ఇందులో రానా కామ్రేడ్ రవన్న గెటప్‌లో ఉండగా.. సాయి పల్లవి మాత్రం పల్లెటూరి అమ్మాయిలా నటిస్తోన్న విషయం తెలిసిందే.