విరాట పర్వం రిలీజ్‌పై సురేష్ బాబు డేరింగ్ స్టెప్: రానా ఈ సారి అలా రాబోతున్నాడట

కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా రెండేళ్ల వ్యవధిలో ఎన్నో సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, మొదటి, రెండో లాక్‌డౌన్ల తర్వాత అందులో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మిగిలినవి మాత్రం ఇప్పటికీ రిలీజ్ డేట్లను కన్ఫార్మ్ చేసుకోలేకపోయాయి. అలాంటి వాటిలో సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కుతోన్న 'విరాట పర్వం' ఒకటి. దగ్గుబాటి రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను గత వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. కానీ, సెకెండ్ వేవ్ కారణంగా దీన్ని వేయాల్సి వచ్చింది.

క్రేజీ కాంబినేషన్‌లో రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'విరాట పర్వం' మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తైంది. సెకెండ్ వేవ్ తర్వాత చివరి షెడ్యూల్‌ను ప్రారంభించి కొద్ది రోజుల్లోనే దాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే పూర్తైన టాకీ పార్ట్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి.. వాటిని కూడా వెంటనే దాదాపుగా పూర్తి చేసేశారు. దీంతో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. కానీ, ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న దానిపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా విడుదల గురించి చాలా రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

Rana Daggubatis Virata Parvam Release On Netflix Directly

'విరాట పర్వం' సినిమాను మొదటి లాక్‌డౌన్‌కు ముందే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, అనివార్య కారణాలతో అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో దీన్ని నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా స్ట్రీమింగ్ చేయబోతున్నారన్న టాక్ కూడా వినిపించింది. అంతేకాదు, ఇప్పటికే నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన డీల్‌ను కూడా ఆ సంస్థతో క్లోజ్ చేసుకున్నారని ప్రచారం జరిగింది. దీంతో రానా సినిమా ఓటీటీలోనే విడుదల కాబోతుందని అంతా డిసైడ్ అయిపోయారు. ఆ తర్వాత ఈ వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. అంతేకాదు, త్వరలోనే థియేటర్లలో రిలీజ్ చేస్తామని కూడా వెల్లడించింది.

ఇక, కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల ఇష్యూ నడుస్తోంది. దీనికితోడు ఇప్పుడు నైట్ కర్ఫ్యూను విధించడంతో పాటు సీటింగ్ ఆక్యూపెన్సీని యాభై శాతానికి తగ్గించారు. దీంతో చాలా సినిమాలను వాయిదా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబు డేరింగ్ స్టెప్ వేయాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. 'విరాట పర్వం' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారట. ఇందుకోసం బడా సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారట.

స్వచ్చమైన ప్రేమకథతో రాబోతున్న 'విరాట పర్వం' చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, సురేష్ ప్రొడక్షనస్ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల మేలవింపుతో రూపొందుతోన్న ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇక, ఇందులో రానా కామ్రేడ్ రవన్న గెటప్‌లో ఉండగా.. సాయి పల్లవి మాత్రం పల్లెటూరి అమ్మాయిలా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X