విరాటపర్వం నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్: ప్రేయసితో కలిసి వచ్చిన కామ్రేడ్ రవన్న
టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'విరాట పర్వం' (రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్). వేణు ఉడుగుల దర్శకత్వంతో రూపొందుతోన్న ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల మేలవింపుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం నుంచి సంక్రాంతి కానుకగా ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చింది.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 13న 'విరాట పర్వం' నుంచి ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటి వరకూ హీరో, హీరోయిన్ల లుక్ విడివిడిగా విడుదలయ్యాయి. అయితే, తాజా పోస్టర్‌లో మాత్రం తొలిసారి హీరో, హీరోయిన్లు కలిసి కనిపిస్తున్నారు. ఇందులో రానా కామ్రేడ్ రవన్న గెటప్‌లో ఉండగా.. సాయి పల్లవి మాత్రం పల్లెటూరి అమ్మాయిలా దర్శనమిచ్చింది. ఈ పోస్టర్‌ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన రానా.. 'షూటింగ్ పూర్తయింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వేసవిలో రాబోతున్నాం' అని పేర్కొన్నాడు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ అప్పుడెప్పుడో ప్రారంభం అయింది. రానా అందుబాటులో లేకపోవడంతో, అతడు లేని సీన్స్ చాలా వరకు షూట్ చేశారు. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. అందులో కామ్రేడ్ రవన్నగా కనిపించిన రానా ఆకట్టుకున్నాడు. ఇక, ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నాడు.


Click it and Unblock the Notifications











