విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన విరాటపర్వం యూనిట్.. రానా, సాయి పల్లవి పవర్ఫుల్ పోస్టర్!

తెలుగు చిత్ర పరిశ్రమలో కరోనా ధాటికి చాలా సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కొన్ని సినిమాలు షూటింగ్ పనులు ఆలస్యం వలన మధ్యలోనే ఆగిపోయాయి. మరికొంత మంది నిర్మాతలు ఆర్థికంగా కూడా దెబ్బతిన్నారు. ఇక అన్నింటినీ దాటుకుంటూ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇక విరాటపర్వం సినిమా కూడా గత ఏడాది నుంచి ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తోంది. విలక్షణ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ అలాగే సాంగ్స్ కూడా యూట్యూబ్ లో మంచి వ్యూవ్స్ ను సొంతం చేసుకున్నాయి.

విరాటపర్వం సినిమాలో రానా దగ్గుబాటి సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించగా ప్రియమణి ఒక పవర్ ఫుల్ నక్సలైట్ పాత్రలో నటించింది. ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది. ఆ మధ్యకాలంలో రానా దగ్గుబాటి కి సంబంధించిన ఒక టీజర్ కూడా సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక తప్పకుండా సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ఈ ఏడాది మొదట్లో వివరణ ఇచ్చారు. కానీ సమ్మర్ దాటిపోతున్నా ఇంకా సినిమాపై క్లారిటీ ఇవ్వడం లేదు అని సోషల్ మీడియాలో కూడా అనేక రకాల కామెంట్స్ వెలువడ్డాయి. ఇక ఫైనల్ గా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా విడుదల తేది పై ఒక క్లారిటీ అయితే ఏం చేశారు.

Rana daggubati sai pallavi movie virata parvam release date announced

ఫైనల్ గా సినిమాను జూలై 1వ తేదీన విడుదల చేయబోతున్నట్లు గా రీసెంట్ గా చిత్ర యూనిట్ సభ్యులు ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఆ పోస్టర్లో రానా దగ్గుబాటి సాయి పల్లవి ఒక వార్ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి కామ్రేడ్ రవన్న పాత్రలో కనిపించబోతున్నాడు. 1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక సాయి పల్లవి.. రానా పాత్రను అభిమానించే ఒక పల్లెటూరి వెన్నెల అనే అమ్మాయి గా కనిపించబోతోంది.

ఈ సినిమాలో ప్రియమణి కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. గతంలో ఈ సినిమాలోని పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మధ్యలో ఓటీటీ లో కూడా విడుదల చేస్తున్నట్లు గా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేయాలని రానా దగ్గుబాటి నిర్మాత సురేష్ బాబు తో కలిసి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అసలైతే ఈ ఏడాది మార్చి నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికే ఇతర సినిమాల విడుదలకు సిద్ధం కావడంతో అనవసరంగా పోటీ ఉండకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక ఫైనల్ గా జూన్ ఒకటో తేదీన సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని పాటలను కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు చర్చలు జరుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X