యాంకర్‌కు ఝలక్.. బుద్ధిలేని ప్రశ్నకు గడ్డి పెట్టిన రానా దగ్గుబాటి

భారతీయ సినిమా పరిశ్రమలో భాషా పరమైన విభేదాలు ఇప్పటివి కావు. మొదటి నుంచి దక్షిణాది నటులున్నా.. చిత్ర పరిశ్రమ విషయమైనా హిందీ వర్గాలకు చిన్నచూడటం అలవాటు. ఇప్పటికీ సౌత్, నార్త్ అని గిరి గీసి మాట్లాడటం రాజకీయాల్లోనే కాదు.. సినిమా పరిశ్రమలో ఎక్కువగానే కనిపిస్తుంది. తాజాగా అలాంటి సంఘటనే బాలీవుడ్ యాంకర్ ద్వారా స్పష్టమైంది. అయితే ఈ సంఘటన దక్షిణాది హీరో రానా దగ్గుబాటికి ఎదురు కావడంతో ఆమెకు బాగానే గట్టిపెట్టారు. ఇంతకు ఏం జరిగిందంటే..

 దక్షిణాది సినిమాలపై అనుచితంగా

దక్షిణాది సినిమాలపై అనుచితంగా

ఇటీవల రానా దగ్గుబాటి ఓ టీవీ డిస్కషన్‌లో పాల్గొన్నాడు. ఎక్కువగా దక్షిణాది సినిమాలపై అవగాహన లేని యాంకర్.. రానాతో మాట్లాడుతూ.. దక్షిణాది సినిమాలు అంతా ఒకేలా ఉంటాయి. పాత్రల చిత్రీకరణ చాలా రొటీన్‌గా ఉంటాయి. నటీనటులు క్యారెక్టరైజేషన్ సరిగా ఉండదు. కథలు అడ్డదిడ్డంగా ఉంటాయి అని మాట్లాడుకొంటూ వెళ్లింది. యాంకర్ మాటలు విన్న రానాకు జాలి వేయడమే కాదు.. ఒళ్లు కూడా మండిందట.

దక్షిణాది రాష్ట్రాలంటే ఎందుకు చులకన

దక్షిణాది రాష్ట్రాలంటే ఎందుకు చులకన

యాంకర్ అవగాహన లోపానికి రానా గట్టిగా కౌంటర్ ఇస్తూ.. ఇతర రాష్ట్రాలంటే కొందరికి చులకనభావం. పక్క రాష్ట్రాలంటే పెద్దగా గౌరవభావం ఉండదు. చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. కనీస అవగాహన లేకుండా రాష్ట్రాల మధ్య విభేదాలను సృష్టించే విధంగా కామెంట్లు చేస్తుంటారు. సినిమా పరిజానం మీ విషయంలో నాకు ఓ అభిప్రాయం ఉంది అంటూ రానా ఝలక్ ఇచ్చాడు.

 ఏ భాష సినిమా అయినా

ఏ భాష సినిమా అయినా

పలు రకాల సినిమా పరిశ్రమలు ఉండవు. మీకు సినిమా పరిశ్రమపై రకరకాల అవగాహన ఉంది. కానీ సినీ నిర్మాణం ఏ భాషలోనైనా ఒక్కటే. భాష మాత్రమే వేరు. అంత మాత్రాన ఇతర భాషలను చిన్నచూపు చూడకూడదు. ఏ పరిశ్రమలోనైనా ఒకే విధంగా సినిమాను చిత్రీకరిస్తారు అని యాంకర్‌కు రానా గట్టిగా బుద్ది చెప్పాడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఆర్ మాధవన్ రియాక్షన్ ఇలా

ఆర్ మాధవన్ రియాక్షన్ ఇలా

రానా దగ్గుబాటి తిరుగులేని విధంగా జవాబు ఇవ్వడంపై విలక్షణ నటుడు ఆర్ మాధవన్ స్పందించాడు. రానా సమాధానం బ్రల్లియెంట్. ఆ యాంకర్ ప్రశ్నలు చాలా దిగజారుడు విధంగా ఉంది. సినిమాపై ఆమెకు కనీస అవగాహన లేదు. ఇలా కుంచిత ఆలోచనలు సరికావు అని ఆర్ మాధవన్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X