అడవుల్లోకి వెళ్లిన రానా దగ్గబాటి: లవ్ స్టోరీని నడిపించేందుకు తొలిసారి అలా!

బడా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమై ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు టాల్ హీరో దగ్గుబాటి రానా. కెరీర్ ఆరంభంలో అంతగా సక్సెస్ కాలేకపోయిన అతడు.. ఆ తర్వాత సరికొత్త ప్రయోగాలతో సత్తా చాటాడు. 'బాహుబలి'లో భల్లాలదేవుడిగా నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన అతడు.. అనారోగ్య కారణాలతో ఇప్పుడు చాలా ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టేశాడు. దీంతో ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమాలన్నీ షూటింగ్ దశలోనే ఆపేయాల్సి వచ్చింది.

సుదీర్ఘ విరామం తర్వాత రానా తన కొత్త సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో అతడు నటిస్తున్న చిత్రం 'విరాటపర్వం'. రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్‌తో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. 1990వ దశకం నాటి ప్రేమ కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో రానా పోలీస్ ఆఫీసర్ గానూ, సాయి పల్లవి నక్సలైట్ గానూ నటిస్తున్నారని అంటున్నారు. ఓ ఆపరేషన్ సమయంలో కలుసుకున్న వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టడం ఈ సినిమా స్టోరీ లైన్ అని ప్రచారం జరుగుతోంది.

Rana Daggubati Start Virata Parvam Shooting

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ అప్పుడెప్పుడో ప్రారంభం అయింది. రానా అందుబాటులో లేకపోవడంతో, అతడు లేని సీన్స్ చాలా వరకు షూట్ చేశారు. ఇప్పుడు మొదలైన షెడ్యూల్‌లో హీరోపైన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. దీని చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2021లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇదిలా ఉండగా, రానా 'అరణ్య' అనే సినిమాలోనూ నటించాడు. దీని కోసం బరువు కూడా తగ్గిపోయాడు. ఈ మూవీ కూడా త్వరలోనే విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X