చికిత్స పూర్తి చేసుకున్న రానా.. అమెరికా నుంచి తిరుగు ప్రయాణం.. వచ్చి రాగానే!
బాహుబలి సిరీస్‌లో భల్లాలదేవగా నటించి యావత్ ప్రపంచం చూపు తనవైపు తిప్పుకున్నారు దగ్గుబాటి రానా. ఈ సినిమాలో బలవంతుడిగా భారీ శరీరంతో కనిపించిన ఆయన ఇటీవలి కాలంలో బాగా సన్నబడ్డాడు. అయితే అనారోగ్యం కారణం గానే ఆయన సన్నబడటం జరిగిందని తెలిసింది. ఆయన లేటెస్ట్ లుక్స్ టాలీవుడ్ ఆడియన్స్‌ని ఆశ్చర్య పర్చాయి.
గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు రానా. ఇందుకోసం అమెరికాలో చికిత్స కూడా తీసుకుంటున్నాడు. దాదాపు మూడు నెలల క్రితం అమెరికా వెళ్లిన ఆయన తిరిగి ఆరోగ్యంగా తయారయ్యారనేది తాజా సమాచారం. అమెరికాలో చికిత్స పూర్తి చేసుకున్న రానా త్వరలోనే తిరిగి భారత్‌కు చేరుకోబోతున్నారు.

ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ స్వయంగా సోషల్ మీడియాలో మెసేజ్ పోస్ట్ చేశాడు రానా. మరో 72 గంటల్లో తాను భారత్‌కు రాబోతున్నానని వెల్లడిస్తూ, తన తాజా పిక్ షేర్ చేశాడు. ఇండియా చేరుకున్న వెంటనే ఆయన తన కొత్త సినిమాల షూటింగుల్లో పాల్గొంటారని తెలిసింది.
రానా ప్రధాన పాత్రలో వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్ గత కొంతకాలంగా రానా కోసం వెయిట్ చేస్తోంది. సో ఇండియా వచ్చిన వెంటనే మొదట ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడట రానా. ఈ సినిమా తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య సినిమాను ప్రారంభించాలని రానా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఏ మాత్రం విరామం లేకుండా వరుస సినిమాలు చేసేలా రానా సన్నాహాలు చేస్తున్నాడని ఫిలిం నగర్ టాక్.


Click it and Unblock the Notifications











