‘విరాట పర్వం’ వచ్చేది అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన యూనిట్

సినిమా విడుదల కంటే ముందే.. నటీనటుల ఎంపికతోనే అందరినీ ఆశ్చర్యపరిచింది విరాటపర్వం యూనిట్. నీదీ నాదీ ఒకే కథ వంటి సహజ చిత్రాన్ని తీసిన దర్శకుడు వేణు ఊడుగుల.. విరాట పర్వం చిత్రాన్ని ప్రకటించడంతోనే అంచనాలు పెరిగాయి. ఇక అందులో ఒక్కొక్క పాత్రను పరిచయం చేస్తూ వదిలిన పోస్టర్లతో అంచనాలు ఆకాశన్నంటాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ వచ్చింది.

మామూలుగా నేడు టాలీవుడ్‌లో అప్డేట్ల పండుగ నడుస్తోంది. దాదాపు సెట్స్ మీదున్న సినిమాలన్నీ కూడా రిలీజ్ డేట్లను ప్రకటిస్తూ ఆ తేదీలను బ్లాక్ చేసేసుకుంటున్నాయి. ఈక్రమంలో తాజాగా విరాట పర్వం కూడా ముందుకు కదిలింది. కామ్రేడ్ రవన్న విశ్వరూపం, తిరుగుబాటును చూపించే తేదీని తాజాగా ప్రకటించేసింది విరాట పర్వం యూనిట్. ఏప్రిల్ 30న థియేటర్లలో విరాట పర్వం సందడి చేయబోతోన్నట్టు ప్రకటించేశారు.

 Rana Daggubati Viraata Parvam Release On 30th April

ఇక విరాట పర్వం సినిమాతో డైరెక్టర్ వేణు మరో హిట్ కొట్టేలా ఉన్నాడు. ఈ మూవీలో సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావ్ వంటి అద్భుతమైన నటీమణులెందరో ఉన్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, మోషన్ పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. రానా ఇప్పటికే తన డబ్బింగ్‌ను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విరాటపర్వం సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.

 Rana Daggubati Viraata Parvam Release On 30th April

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X