Miheeka Bajaj: రానా భార్య ప్రెగ్నెంట్.. ఆ సర్‌ప్రైజ్ న్యూస్ ఆయన్నే అడగాలంటూ మిహీకా!
స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. మొదటి నుంచి సెలెక్టివ్ గా సినిమాలు చేసుకంటూ తనదైన ముద్ర వేసుకున్నాడు. లీడర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రానా అప్పట్లోనే హిందీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకున్నాడు. ఓవైపు హీరోగా.. మరోవైపు విలన్ గా కూడా మెప్పిస్తూ వర్సటైల్ యాక్టర్ అనిపించుకుంటున్నాడు. అయితే గత కొద్దిరోజులుగా రానా భార్య మిహీకా బజాజ్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు తెగ వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించారు మిహికా.
లీడర్ గా సినీ కెరీర్ మొదలు పెట్టిన దగ్గుబాటి రానా.. తర్వాత వెంటనే దమ్ మారో దమ్ అనే హిందీ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం తెలుగులో నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుం, ఆరంభం, రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, నేనే రాజు నేనే మంత్రి, ఎన్టీఆర్ కథానాయకుడు, అరణ్య, భీమ్లా నాయక్, విరాట పర్వం వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. డిపార్ట్ మెంట్, యే జవానీ హై దివానీ, సమ్ థింగ్ సమ్ థింగ్, వెల్ కమ్ టు న్యూయార్క్, హౌజ్ ఫుల్ 4 వంటి హిందీ చిత్రాల్లో కూడా మెప్పించాడు.

ఇటీవలే రానా దగ్గుబాటి బాబాయ్ వెంకటేష్ తో కలిసి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలైన రానా నాయుడు సిరీస్ పర్వాలేదనిపించుకుంది. ఇదిలా ఉంటే రానా మూడేళ్ల ముందు మిహీకా బజాజ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా మిహీకా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు తెగ వస్తున్నాయి. అయితే ఓ సందర్భంలో మిహీకా నుంచి గుడ్ న్యూస్ వినబోతున్నారంటూ రానా చెప్పాడు. దీంతో ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా రానా అలా చెప్పడం, ప్రెగ్నెన్సీ వార్తలపై ఓ లైఫ్ స్టైల్ ఈవెంట్ లో మిహీకా స్పందించారు. "రానా నా నుంచి సర్‌ప్రైజింగ్ న్యూస్ వస్తుందని ఎందుకు చెప్పారో నాకు తెలియదు. నిజంగానే ఆ సర్‌ప్రైజ్ ఏంటో రానా గారినే అడగాలి. అన్నట్లు నేను ప్రెగ్నెంట్ కాదు. పెళ్లి తర్వాత నాకు కాస్తా ఒళ్లు వచ్చి బరువు పెరిగాను. అది చూసి చాలా మంది నేను ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే కచ్చితంగా అందరికీ ఆ విషయం చెబుతాను" అని మిహీకా చెప్పుకొచ్చారు.

మిహీకా బజాజ్ సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదని తెలిసిందే. పెళ్లికి ముందే ఆమెకు డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో అనే ఇంటీరియర్ డెకరేషన్ కంపెనీ ఉంది. ప్రస్తుతానికి తన బిజినెస్ పనులతోనే సరిపోతుందని, తాను సినిమాల్లోకి రావాలనుకోవడం లేదని మిహీకా తెలిపింది. ఇక రానా, మిహీకా ప్రేమించి 2020లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











