For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Virata Parvam విషయంలో రానా డేరింగ్ స్టెప్: ఆ సినిమాల పరిస్థితి చూసి కీలక నిర్ణయం

  |

  కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోవిడ్ కారణంగా రెండు దశల్లో కలిపి చాలా రోజుల పాటు థియేటర్లు మూతపడడం, ఆ తర్వాత సినిమా హాళ్లన్నీ తెరుచుకున్నప్పటికీ యాభై శాతం ఆక్యూపెన్సీతోనే నడుస్తుండడం, పైగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల ఇష్యూ కారణంగా పరిశ్రమలో ప్రస్తుతం గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు నటించిన చిత్రాలతో పాటు, చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకుండా ఆగిపోవాల్సి వచ్చింది. ఇలా ఈ చాలా రోజులుగా విడుదల వాయిదా పడుతోన్న కొన్ని చిత్రాల్లో 'విరాట పర్వం' ఒకటి.

  ఆ కంటెస్టెంట్‌కు నాగబాబు సపోర్ట్: బిడ్డ లాంటి వాడంటూ కామెంట్.. అభిజీత్ గెలిచినట్లే తను కూడా!

  దగ్గుబాటి రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా వేణు ఉడుగుల తెరకెక్కించిన చిత్రమే 'విరాట పర్వం'. రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తైంది. సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలే చివరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకూ పూర్తైన టాకీ పార్ట్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి.. వాటిని కూడా వెంటనే కంప్లీట్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు జరుగుతోన్న షూట్‌ మాత్రమే బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇది కూడా ఈ వారంలోనే మొత్తం పూర్తవుతుంది. ఫలితంగా విడుదలకు సిద్ధం అవుతుంది.

  Rana Daggubatis Virata Parvam Release in theaters Soon

  షూటింగ్ పార్ట్ కొంత భాగం మిగిలిన ఉన్నప్పటికీ 'విరాట పర్వం' విడుదల గురించి చాలా రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌కు ముందే దీన్ని విడుదల చేయాలని భావించారు. కానీ, అనివార్య కారణాలతో అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా స్ట్రీమింగ్ చేయబోతున్నారన్న టాక్ కూడా వినిపించింది. అంతేకాదు, ఇప్పటికే నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన డీల్‌ను కూడా ఆ సంస్థతో క్లోజ్ చేసుకున్నారని అన్నారు. దీంతో రానా సినిమా ఓటీటీలోనే విడుదల కాబోతుందని అంతా ఓ అంచనాకు వచ్చేశారు.

  యాంకర్ రవికి మానస్ వార్నింగ్: ఆమెతో ఎఫైర్ ఉందని అనడంతో ఫైర్.. అతడి స్థాయి అదే అంటూ షాకింగ్‌గా!

  అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. 'విరాట పర్వం' మూవీని థియేటర్లలోనే విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని తెలుస్తోంది. సెకెండ్ వేవ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో ఇప్పటికే విడుదలైన పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే రానా తన సినిమాను కూడా థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. దీనికి చిత్ర యూనిట్ కూడా అంగీకరించిందని తెలుస్తోంది. ఇక, ఈ మూవీ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

  క్రేజీ కాంబినేషన్‌లో ప్యూర్ లవ్‌స్టోరీతో రాబోతున్న 'విరాట పర్వం' చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల మేలవింపుతో రూపొందుతోన్న ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇక, ఇందులో రానా కామ్రేడ్ రవన్న గెటప్‌లో ఉండగా.. సాయి పల్లవి మాత్రం పల్లెటూరి అమ్మాయిలా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  English summary
  Rana Daggubati And Sai Pallavi Starrer ‘Virata Parvam’ Release Postponed Due to Covid Lockdown. This Movie Release in theaters Soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X