‘శశి’ కోసం రానా.. భారీ ప్రమోషన్స్‌లో ఆది
ఆది సాయి కుమార్ ప్రస్తుతం శిశ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. చాలా కాలం నుంచి ఓ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆదికి శశి రూపంలో ఆశ నెరవేరేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వదిలిన పాట, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రమోషన్స్ చేసే పద్దతి చూస్తుంటే అందరూ అవాక్కవుతున్నారు. ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించారు.
చిరంజీవి చేతుల మీదుగా శశి టీజర్‌ను రిలీజ్ చేయించారు. అది ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. ఈ మధ్యే పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు. అది కూడా ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో, పవన్ కళ్యాణ్‌తో హీరో హీరోయిన్లు దిగిన సెల్ఫీలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఇక ఈ మూవీ వచ్చే వారం విడుదలవబోతోంది. ఈ క్రమంలో నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.

నేడు సాయంత్రం జరగబోతోన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రానాను రంగంలోకి దించారు. ఈ ఈవెంట్‌కు రానాను ముఖ్య అతిథిగా పిలిచి ఈవెంట్‌పై అందరి దృష్టి పడేలా చేసుకున్నారు. మొత్తానికి శశి సినిమాపై అందరిలోనూ ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 19న రాబోతోన్న ఈ మూవీలో సురభీ, రాశీ సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











