జాతిరత్నాలుతో మూడో సీజన్.. ఆహాలో రానా సందడి
రానా హోస్ట్‌గా వచ్చిన నెంబర్ వన్ యారీ అనే షో ఎంతగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. తన ఫ్రెండ్స్‌ను షోకు గెస్ట్‌లుగా తీసుకొచ్చి చిన్న నాటి రోజుల గురించి అందరికీ తెలిసేలా చేశాడు. అలా రెండు సీజన్లు బాగానే క్లిక్ అయ్యాయి. అయితే తాజాగా మూడో సీజన్ షురూ అయింది. అయితే మొదటి ఎపిసోడ్‌ను గ్రాండ్‌గానే ప్లాన్ చేశారు. అయితే ఈ సారి మాత్రం ఈ షోను ఆహా యాప్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నాడు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా జాతి రత్నాలు టీం సందడే కనిపిస్తోంది. ఇప్పటికే వచ్చిన టాక్ ప్రకారం జాతి రత్నాలు సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. అయితే బుల్లితెరపై వీలైనంతగా ప్రమోషన్స్ చేసిన జాతి రత్నాలు టీం ఇప్పుడు నెంబర్ వన్ యారీ షోలోనూ సందడి చేసేందుకు వచ్చింది. ఈమూడో సీజన్‌ను జాతి రత్నాలుతో మొదలుపెట్టేశాడు రానా. ఈ మేరకు వదిలిన ప్రోమో వైరల్ అవుతోంది.

నవీన్ ఎంత మందితో రిలేషన్ షిప్‌లో ఉన్నాడు? అసలు మీ ముగ్గురు ఫ్రెండ్సేనా? అంటూ రకరకాల ప్రశ్నలు సంధించాడు రానా. ఈ అందరి మధ్యలో నాగ్ అశ్విన్ కూడా సందడి చేశాడు. మొత్తానికి జాతి రత్నాలు పేరిటి ఈ షోలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి చేసిన అల్లరి బాగానే వైరల్ అవుతోంది. ఈ మొదటి ఎపిసోడ్ ఈ ఆదివారం రాత్రి నుంచి అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications











