మత్తు వదలరా ప్రమోషన్స్.. షాకింగ్ లుక్‌లో రానా
బాహుబలి చిత్రంలో భల్లాలదేవ పాత్రతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న రానా ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రం విరాట పర్వం నుంచి ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇవే కాక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో సైతం ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. అయితే రానా ఆరోగ్యంపై, ఆయన లుక్‌పై సోషల్ మీడియాలో రూమర్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరోసారి రానా లుక్ మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

గతంలో రూమర్లు..
రానా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనే ప్రచారం జరిగింది. రానా ప్రస్తుతం అమెరికాలో కిడ్నీ సంబంధిత చికిత్స తీసుకుంటున్నాడనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే వీటిని ఎన్నిసార్లు ఖండించినా.. రూమర్లు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయారు.

ఖండించిన రానా..
తాను కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నానని ఇప్పటికే ఎన్నో వదంతులు సృష్టించారని మండిపడ్డాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, బావున్నానని చెప్పి చెప్పి విసుగోస్తోందని అసహనానికి లోనయ్యాడు.
మత్తు వదలరా ప్రమోషన్స్‌లో
కీరవాణి తనయుడు శ్రీ సింహా కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తోన్న మత్తువదలరా చిత్రంతో మరో కుమారుడు కాళభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రానికి మొదట్నుంచీ పెద్ద ఎత్తున్న ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్‌తో టీజర్ రిలీజ్ చేయించగా రానాతో ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు.
రిలీజ్ చేసిన రానా..
ఈ మూవీ ట్రైలర్‌ను రానా రిలీజ్ చేస్తున్నానని చెబుతూ రానా ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలాడు. అయితే రానా చెప్పిన విషయం కంటే ఆయన లుక్, ఆరోగ్యంపైనే అందరూ శ్రద్ద చూపిస్తున్నారు. ఈ ట్రైలర్ కూడా అందర్నీ ఆకట్టుకునేలానే ఉంది.


Click it and Unblock the Notifications











