రానా పెళ్లి వేడుకలో మిహీక, సమంతల కాస్ట్లీ చీరలు.. వాటి ధర ఎంతో తెలుసా?

టాలెంటెడ్ యాక్టర్ రానా దగ్గుబాటి మొత్తానికి ఒక ఇంటివాడయ్యాడు. ఎన్నో ఏళ్ల బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టేసి మ్యారేజ్ లైఫ్ తో ఇక కొత్త దారిలో నడవాలని అనుకుంటున్నాడు. రానా, మిహీక బజాజ్ ని ప్రేమ వివాహం చేసికున్న విషయం తెలిసిందే. ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఫైనల్ గా రామానాయుడు స్టూడియోలో సింపుల్ అండ్ బెస్ట్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి ఖర్చు ఏ మాత్రం తక్కువ కాలేదని తెలుస్తోంది.

Recommended Video

Rana Daggunati Tied Knot With Miheeka Bajaj ఇంట్లో నుంచే పెళ్లిని చూసేలా దగ్గుబాటి ఏర్పాట్లు !
కరోనా గోల లేకుండా ఉంటే..

కరోనా గోల లేకుండా ఉంటే..

అసలైతే పెళ్లిని ఫలక్ నుమా ప్యాలెస్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవ్వడం వలన అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించుకోవాల్సి వచ్చింది. కరోనా గోల లేకుండా ఉంటే సురేష్ బాబు ఇండియాలోని టాప్ మోస్ట్ సెలబ్రెటీస్ ని అలాగే రాజకీయ ప్రముఖులను పిలిచేవారు.

 లేడీస్ చీరలకు చాలా కాస్ట్లీ..

లేడీస్ చీరలకు చాలా కాస్ట్లీ..

ఇక రామానాయుడు స్టూడియోలో పెళ్లికి ఎంత ఖర్చు చేశారో తెలియదు గాని ఫ్యామిలీలో లేడీస్ చీరలకు మాత్రం ఖర్చు భారీగానే అయ్యిందట. మెయిన్ గా పెళ్లి కూతురు మిహీకా బజాజ్ సారి చాలా కాస్ట్లీ అని తెలుస్తోంది. ఆమె ఆ చీర కోసం ఎన్నో వారాలుగా డైజైనర్ తో చర్చలు జరిపారట.

పెళ్లి డ్రెస్ కోసం రూ.6లక్షలు

పెళ్లి డ్రెస్ కోసం రూ.6లక్షలు

పెళ్లి పీఠలపై మిహీక గోల్డెన్, క్రీమ్ కలర్ లెహెంగాలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ డ్రెస్ ను ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా డైజైన్ చేశారు. ఈ డ్రెస్ కోసం మిహీక దాదాపు 6లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం డ్రెస్ ను హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారట. ఇక హల్దీ ఈవెంట్ లో ధరించిన పసుపు రంగు డ్రెస్ కి రెండు లక్షల వరకు ఖర్చు చేశారట.

 సమంత డ్రెస్ కూడా..

సమంత డ్రెస్ కూడా..

ఇక పెళ్లిలో స్టార్ హీరోయిన్ సమంత కూడా చాలా సందడిగా కనిపించింది. ఆమె చీర కూడా ఫంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఆమె చీర ధర విషయానికి వస్తే.. రా మాంగో డిజైన్ చేసిన ఆ చీర కూడా నీలం రంగుపై ఎంబ్రాయిడరీ చేయించినట్లు తెలుస్తోంది. ధర లక్షకి పైగానే ఉంటుందని సమాచారం.

ఆ డ్రెస్ విలువ రూ.1.59లక్షలు

ఆ డ్రెస్ విలువ రూ.1.59లక్షలు

ఇక హల్దీ వేడుకలో కూడా సమంత సందడి ఒక రేంజ్ లో కనిపించింది. ఆ ఫంక్షన్ లో ఆమె ధరించిన డ్రెస్ విలువ రూ.1.59లక్షలు. దీనిని డిజైన్ చేయడానికి రెండు వారాల సమయం పెట్టిందట. మొత్తానికి దగ్గుబాటి వారి వేడుకలో అమ్మాయిల చీరలు దగదగ మెరిసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X