ఆలియా-రణ్‌బీర్‌ల కూతురు ఎంత క్యూట్‌గా ఉందో కదా.. రాహా అందాలకు అంతా ఫిదా అవ్వాల్సిందే!

బాలీవుడ్ సూపర్ క్యూట్ కపుల్ రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్ జంట గురించి అందరికీ తెలిసిందే. చాలా ఏళ్ల పాటు గుట్టుగా ప్రేమాయణం సాగించిన ఈ జంట గతేడాది అంటే 2022 ఏప్రిల్ 14వ తేదీన అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొంత కాలానికే తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి అందిరికీ షాకిచ్చారు. ముఖ్యంగా నవంబర్ 6వ తేదీ పాప కూడా పుట్టిందని తెలిపారు. అయితే వీరి పెళ్లికి ముందే ఆలియా గర్భవతి అయింది. ఈక్రమంలోనే వీరు పెళ్లి చేసుకుని అఫీషయల్ అయిపోయారు. ఆ తర్వాత పాప పుట్టడంతో అంతా తెగ ఎగ్జైట్ అయిపోయారు.

పెళ్లి తర్వాత ముఖ్యంగా ఆలియా తల్లి కాబోతున్నట్లు ప్రకటించగానే విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కానీ అవేమిటీని పట్టించుకోకుండా ఆలియా, రణ్‌బీర్‌ లు హ్యాపీగా జీవితాన్ని ముందుకు సాగించారు. పాపు పుట్టాక అయితే వీరు మరింత హాయిగా ఉంటున్నారు. తమ కూతురుకు సెపరేట్ గా టైమ్ కేటాయిస్తూ మరి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పాప పుట్టి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఆమెను చూపించలేరు ఈ దంపతుపు. కానీ తమ ముద్దుల పాపాయికి రాహా అని నామకరణం చేసినట్లు గతంలోనే ప్రకటించారు.

Ranabir Kapoor Alia Bhatt Daughter Raha Photos Goes Viral

అయితే తాజాగా ఈ క్యూట్ కపుల్.. తమ ముద్దుల కూతురును మీడియాకు పరిచయం చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పాపాయిని అందరికీ చూపించడంతో అంతా తెగ సంబుర పడిపోతున్నారు. చాలా క్యూట్ గా ఉంది, అందంగా ఉందంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం రాహాకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాహా ఫొటోలను బయటకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకున్న ఈ జంటే స్వయంగా మీడియాకు పరిచయం చేయడంతో వీరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

తమ అభిమాన హీరోయిన్ ఆలియాలాగే పాపాయి ఉందని ఆమె ఫ్యాన్స్ చెబుతుండగా.. లేదు లేదు తమ ఫేవరెట్ హీరో లాగే ఉందంటూ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. బేబీ పింక్ డ్రెస్ లో రాహా చాలా బబ్లీగా కనిపిస్తుండగా.. షార్ట్ క్యూట్ ఫ్రాక్ వేసుకుని ఆలియా మరింత అందంగా దర్శనం ఇచ్చింది. అలాగే రణ్‌బీర్ ఎప్పటిలాగే చాలా హ్యాండ్ సమ్ గా కనిపించారు. ఈ క్యూట్ ఫ్యామిలీ పిక్స్ నెట్టింట ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. మీరూ ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

Ranabir Kapoor Alia Bhatt Daughter Raha Photos Goes Viral

రణ్‌బీర్‌ కపూర్ ప్రస్తుతం యానిమల్ సినిమా హిట్టు కావడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా, రణ్‌బీర్‌ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ బాక్సాఫీసును బద్ధలు చేస్తోంది. ఇప్పటికీ థియేటర్ల వద్ద ఫుల్ సందడి చేస్తూ దూసుకెళ్తోంది. 1000 కోట్ల సాధించే వరకు ఆగేలా కూడా కనిపించడం లేదీ యానిమల్ చిత్రం. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X