'రణరంగం' సౌండ్ కట్ ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్
శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి హీరో హీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ రూపొందించిన చిత్రం 'రణరంగం'. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సినిమా ప్రమోషన్లో భాగంగా 'రణరంగం' సౌండ్ కట్ ట్రైలర్ విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీన్ని రిలీజ్ చేశారు. శర్వానంద్‌కు క్లోజ్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్ సౌండ్ కట్ ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం మాట్లాడుతూ... 'సూపర్బ్..సౌండ్ కట్ ట్రైలర్ చాలా కొత్తగా, టెర్రిఫిక్‌గా ఉంది. ఇటీవల ట్రైలర్ చేశాను. శర్వానంద్‌ను ఎలా చూడాలనుకున్నామో అలా ఉంది' అంటూ ప్రశంసించారు.
శర్వాలో ఉన్నది, మాకు నచ్చింది...అతనిలో ఉన్న ఇంటెన్సిటీ. అతని చిత్రాల్లో 'కో అంటే కోటి' మూవీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ విధంగా ఇంటెన్సిటీ ఉన్న చిత్రం శర్వాకు పడితే బాగుంటుంది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. 'రణరంగం' సౌండ్ కట్ ట్రైలర్ చూశాక ఈ సారి అలాంటి ఇంటెన్సిటీ ఉన్న సినిమా పడబోతోంది' అనే విషయం అర్థమైందని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.
ట్రైలర్ చూస్తుంటే సుధీర్ వర్మ మరోసారి తన సత్తాచాటబోతున్నట్లు తెలుస్తోంది. సన్నివేశాల తాలూకు కట్స్ బాగున్నాయి. ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ప్రశాంత్ పిళ్ళై సంగీతం బాగుండటంతో పాటు కొత్తగా ఉంది. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉందని రామ్ చరణ్ తెలిపారు.

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ - కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ


Click it and Unblock the Notifications











