Brahmastra Twitter Review: రాజమౌళి మెచ్చిన బ్రహ్మాస్త్రలో హైలెట్స్ ఉన్నాయి.. కానీ అసలైందే మిస్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత విడుదలవుతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర మొత్తానికి శుక్రవారం రోజు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ గ్రాండియర్ ఫాంటసీ సినిమాగా అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. ఇక ఆలియా భట్ రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించగా మరి కొంత మంది ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ ను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా వారి రివ్యూలు అందిస్తున్నారు. ఇక మొత్తంగా ట్విట్టర్లో వస్తున్న టాక్ లో కి వెళితే..
ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ..
బ్రహ్మాస్త్ర సినిమా ఒక ఆసక్తికరమైన స్టోరీ లైన్ తో సూపర్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ గా తెరకెక్కింది. కొంతవరకు ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ నీరసమైన స్టోరీ లైన్ కొంత చిరాకును తెప్పిస్తుంది అని చెబుతున్నారు. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా పేలవంగా ఉంది అంటూ కొన్ని సన్నివేశాల్లో హై విజువల్ ఎఫెక్ట్స్ తో ఉన్నప్పటికీ ఎమోషన్స్ మాత్రమే అందుకు తగ్గట్టుగా వర్కౌట్ కాలేదని ముఖ్యంగా మరికొన్ని పాత్రల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అని చెబుతున్నారు.
రన్ టైమ్ తగ్గిస్తే..
అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా లేదు అంటూ ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా వరస్ట్ గా ఉంది అని మరి కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని అసలు కథ కూడా అంత బలంగా ఏమీ లేదు అని సినిమాలో ఏదైనా మంచి అంశం ఉంది అంటే అది షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ మాత్రమే అంటున్నారు. ఇక సినిమాలోని రన్ టైం కూడా మరికొంత తగ్గిస్తే బెటర్ అని కూడా చెబుతున్నారు.
హైలెట్ అయ్యే అంశాలు
బ్రహ్మాస్త్ర సినిమాకు మరి కొంతమంది పాజిటివ్ రివ్యూలు కూడా అందిస్తున్నారు. మొత్తానికి సినిమా చాలా బాగుంది అంటూ ముఖ్యంగా రణబీర్ కపూర్ అలియా భట్ మధ్యలో కొనసాగి కెమిస్ట్రీ అద్భుతమని చెబుతున్నారు. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో పాటు సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది అని అందుకు తగ్గట్టుగానే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది అని చెబుతున్నారు. అయితే కథ మాత్రం డీసెంట్ గా ఉంది అని స్క్రీన్ ప్లే కూడా పరవాలేదు అని కూడా మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
ఎక్కువగా అలాంటి టాక్
సోషల్ మీడియాలో అయితే బ్రహ్మాస్త్ర సినిమాను చూసినవారు చాలావరకు సినిమా యావరేజ్ గా ఉంది అని చెబుతున్నారు. అలాగే మరికొందరు అద్భుతంగా ఉంది అంటే మరి కొందరు మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది అని అంటున్నారు. ఇక ఆలియా భట్ రన్బీర్ కపూర్ ఇష్టపడిన వారు మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అనేలా ఉంది అని సినిమాలో అస్త్రాలు వాటిని చూపించిన విధానం కూడా అద్భుతమైన కామెంట్ చేస్తున్నారు.
అసలైంది లేకుండానే..
ఫైనల్ గా సినిమా అయితే మధ్యలో కొంత నీరసంగా అనిపిస్తుంది అని కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో అద్భుతంగా చూపించారు అంటూ షారుక్ ఖాన్ పాత్ర కూడా కంటెంట్కు తగ్గట్టుగా ఉంది అని అమితాబచ్చన్ పాత్ర కూడా సినిమాకు మేజర్ ప్లస్ ఉంటున్నారు ఇక దర్శకుడు కథలో మేయిన్ సోల్ లేకుండానే సినిమాను ముగించాడు అని మిగతా అన్ని అంశాలు కూడా బెటర్ గానే ఉన్నట్లు మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా అయితే సినిమా యావరేజ్ అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











