twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంగ్ గోపాల్ వర్మ మూవీ పోస్టర్ రిలీజ్.. సామాజిక కార్యకర్త సంధ్య చేతుల మీదుగా..

    |

    టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడిపై విమర్శనాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల సందడి ఎక్కువగానే కనిపిస్తున్నది. ఇటీవల వర్మ వ్యవహారతీరుపై అభిమానుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కుతున్న చిత్రం రాంగ్ గోపాల్ వర్మ. ఈ చిత్రానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. పరాన్నజీవి, రోజు గిల్లేవాడు (ఆర్జీవి) చిత్రాల తర్వాత వస్తున్న మూడో విమర్శనాత్మక చిత్రం కావడం గమనార్హం.

    'రాంగ్ గోపాల్ వర్మ' చిత్రంలో టైటిల్ పాత్రను స్టార్ కమెడియన్ షకలక శంకర్ పోషిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ హైదరాబాద్‌లోని పలు ప్రదేశాల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ సామాజిక కార్యకర్త, మహిళల సమస్యలపై గళం వినిపించే దేవి ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

    Rang Gopal Varma poster released which directed by Senior Journalist Prabhu

    ఇక రాంగ్ గోపాల్ వర్మ చిత్రం పోస్టర్‌ను మహిళాభ్యుదయవాది, సామాజిక కార్యకర్త సంధ్య ఆగస్టు 26వ తేదీన రిలీజ్ చేశారు. అనంతరం సంధ్య మాట్లాడుతూ.. మహిళల పట్ల చాలా చిన్న చూపు కలిగిన ఓ దర్శకుడి చేష్టలను ఎండగడుతూ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రూపొందిస్తున్న 'రాంగ్ గోపాల్ వర్మ' చిత్రాన్ని నేను స్వాగతిస్తున్నాను. డబ్బు కోసం వ్యక్తిత్వహననాలకు పాల్పడే వ్యక్తుల్ని ఎంతమాత్రం ఉపేక్షించకూడదు" అన్నారు.

    Rang Gopal Varma poster released which directed by Senior Journalist Prabhu

    ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలతో విసిగిపోయి తాను ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నాను. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ చిత్రం కోసం తాను రాసిన 'వర్మా వర్మా వర్మా... ఓ రాంగ్ గోపాల్ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా మా ఖర్మ' అనే పాట ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా త్వరలో రిలీజ్ కానున్నది అని రచయిత, దర్శక, నిర్మాత ప్రభు తెలిపారు.

    English summary
    Rang Gopal Varma poster released which directed by Senior Journalist Prabhu. Popular comedian Shakalaka Shankar is playing lead role in the film. This is satirical film on the popular directors behaviour.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X