For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అల్లాదీన్ మించి తెలుగు తెరపై గొరిల్లా.. రంగం ఫేమ్ జీవా మూవీ 21న రిలీజ్

|

వెండితెర‌మీద సాహ‌స‌వంత‌మైన హీరోలు, వారికి సాయం చేసే జంతువులు అనేది ఎవ‌ర్‌గ్రీన్ కాన్సెప్ట్. నిన్న‌టికి నిన్న విడుద‌లై సంచ‌నాలు సృష్టిస్తున్న అలాద్దీన్‌లోనూ కోతిపిల్ల అశేష‌ప్ర‌జానీకాన్ని ఆక‌ట్టుకుంటోంది. తాజాగా మ‌న ద‌క్షిణాది సినిమాలోనూ ఓ గొరిల్లా హ‌ల్ చ‌ల్ చేయ‌నుంది. రంగం ఫేమ్ జీవా హీరోగా న‌టించిన గొరిల్లాలో ఈ సంద‌డి క‌నిపించ‌నుంది.

అర్జున్ రెడ్డితో క్రేజ్ తెచ్చుకుని, తాజాగా 118తో గోల్డెన్ లెగ్‌గా మ‌రో సారి ప్రూవ్ చేసుకున్న నాయిక... షాలినీ పాండే ఇందులో హీరోయిన్ న‌టించారు. డాన్ శాండీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఆల్ ఇన్ పిక్చ‌ర్స్ నిర్మించాయి. గంగా శ‌బ‌రీష్ రెడ్డి నిర్మాత‌. సంతోషి స‌మ‌ర్ప‌కురాలు.

 Rangam Fame Jeevas Gorilla will release on June 21st

ఈ చిత్రం గురించి నిర్మాత శ‌బ‌రీష్ రెడ్డి మాట్లాడుతూ బ్యాంకును కొల్ల‌గొట్ట‌డానికి ఓ బృందానికి గొరిల్లా చేసిన సాయం ఏంటి? అస‌లు ఆ బృందం ఆ ప‌నిలో నిమ‌గ్నం కావ‌డానికి కార‌ణాలు ఏంటి? అనే పాయింట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇండియ‌న్ స్క్రీన్ మీద తొలిసారి గొరిల్లా యాక్ట్ చేసింది మా సినిమాలోనే. కాంగ్ అనే గొరిల్లాను థాయ్‌ల్యాండ్ నుంచి ఈ సినిమా కోసం తీసుకున్నాం. థాయ్‌ల్యాండ్‌లోని సాముట్ ట్రైనింగ్ సెంట‌ర్‌లో శిక్ష‌ణ పొందిన గొరిల్లా ఇది. ప‌లు హాలీవుడ్ చిత్రాల‌కు చింపాంజీల‌ను, గొరిల్లాల‌ను ఈ సంస్థ‌లో శిక్ష‌ణనిస్తుంటారు. గొరిల్లాకు సంబంధించిన మేజ‌ర్ పోర్ష‌న్‌ను థాయ్‌ల్యాండ్‌లో చిత్రీక‌రించాం. మిగిలిన స‌న్నివేశాల‌ను ఇండియాలో రూపొందించాం. ప్ర‌తి ఫ్రేమూ ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. విజువ‌ల్ ట్రీట్ అవుతుంది. క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ ఉంటుంది. త్వ‌ర‌లోనే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను, పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ ఇతర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జూన్ 21న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

 Rangam Fame Jeevas Gorilla will release on June 21st

కాంగ్ (గొరిల్లా), రాధా ర‌వి, యోగిబాబు, రాజేంద్ర‌న్‌, రాందాస్‌, స‌తీష్‌, వివేక్ ప్ర‌స‌న్న‌త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్‌.సి.ఎస్‌., కెమెరా: ఆర్‌.బి.గురుదేవ్‌, ఎడిటింగ్‌: ఆంథోని. ఎల్‌.రూబెన్‌, నిర్మాత‌: గంగా శ‌బ‌రీష్ రెడ్డి, ర‌చ‌న - స్క్రీన్‌ప్లే: డాన్ శాండే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఉమేష్‌.టి.ప్ర‌ణ‌వ్‌.

English summary
Like Aladdin, South Indian film ‘Gorilla’ on the same concept is all set to test its fortune, starring Rangam movie fame Jeeva. While Arjun Reddy fame Shalini Pandey, who proved her acting mettle with ‘118’ is signed it to play the female lead, this heist comedy thriller is written and directed by Don Sandy under Ganga Shabareesh Reddy’s production and Santoshi’s presentation in Ganga Entertainment along with All In Pictures.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more