నాగార్జున అభిమానిగా రంగస్థలం నటుడు!

రంగస్థలం ఫేమ్ మహేష్ గుర్తున్నాడుగా.. ఆ చిత్రంలో రాంచరణ్ స్నేహితుడిగా నటించాడు. మహేష్ నటన అందరిని బాగా ఆకట్టుకుంది. గోదావరి యాసలో మహేష్ చెప్పిన డైలాగులు బావున్నాయి. కాగా మహేష్ ప్రధాన పాత్రలో 'నేను నా నాగార్జున' అనే చిత్రంలో నటిస్తున్నాడు. సోమి వర్మ ఈచిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్బి గోపాల్ ఈ చిత్రానికి దర్శకుడు.

గుండపు నాగేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన ఈ చిత్రంలో కీలక పాత్రలో కూడా నటిస్తున్నారు. కళాబందు టి సుబ్బిరామిరెడ్డి చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ అయింది. గుండపు నాగేశ్వర రావు స్వతహాగా నాగార్జున అభిమాని అని టి సుబ్బిరామిరెడ్డి అన్నారు. ఆయన పేరుతో సినిమా తీయడమే కాక, మంచి పాత్రలో నటించారని సుబ్బిరామిరెడ్డి అన్నారు. కామెడీ ప్రధానాంశంగా సాగే ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Rangasthalam fame Mahesh new movie Nenu Na Nagarjuna

దర్శకుడు గోపాల్ అనుకున్న సమయానికి చిత్రాన్ని చక్కగా చిత్రీకరించి పూర్తి చేసారని నాగేశ్వర రావు అన్నారు. ఈ చిత్రం ఎక్కువ భాగం విశాఖలో చిత్రీకరించాం అని అన్నారు. మహేష్, సోమి వర్మ ఈ చిత్రం చాలా బాగా నటించారని అన్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులని కూడా అలరిస్తుందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X