'రంగస్థలం' హవా కొనాగుతూనే ఉంది.. చెర్రీ వైఫ్ ప్రమోషన్స్
Recommended Video
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'రంగస్థలం' సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో తెలిసిందే. రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తూ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదల కావడం, భారీ సక్సెస్ సాధించడం అన్నీ అయిపోయి చాలాకాలం అయింది. కానీ తాజాగా 'రంగస్థలం' సినిమా మరోసారి వార్తల్లో నిలిచి ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి పోతే..

రామ్ చరణ్ డిమాండ్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సినిమాలకు తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఈయన నటించిన హిట్ సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో రామ్ చరణ్ సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. గతంలో చెర్రీ నటించిన మగధీర సినిమా మలయాళంలో విడుదలై విజయం భారీ సాధించింది.
మలయాళంలో 'రంగస్థలం'
ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ 'రంగస్థలం' మలయాళంలో కేరళ రాష్ట్రంలో రిలీజ్ చేయబడింది. తెలుగులో ఈ సినిమా సృష్టించిన కలెక్షన్ల సునామీ చూసి ఇప్పుడు మలయాళంలో రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ వేదికగా తెలిపి రామ్ చరణ్.. 'రంగస్థలం' జర్నీ మలయాళంలో కూడా సాగుతోందని తెలుపుటకు సంతోషిస్తున్నాను అని పేర్కొన్నాడు.

ఉపాసన ప్రమోషన్స్
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటూ తనకు, తన కుటుంబానికి సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు నెటిజన్ల ముందుంచుతూ ఉంటుంది ఉపాసన. ఈ మేరకు రామ్ చరణ్ ఫేస్‌బుక్‌లో పెట్టిన రంగస్థలం మలయాళం పోస్టర్‌ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసి తన వంతు చిత్రానికి ప్రమోషన్ చేసింది ఉపాసన.

రంగస్థలం మూవీ విశేషాలు
తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇచ్చిన రంగస్థలం మూవీలో రామ్ చరణ్, సమంత, జగపతిబాబు, ఆది పినిశెట్టి నటన ప్రేక్షకలోకాన్ని కట్టిపడేసింది. సుకుమార్ టేకింగ్, దేవీ శ్రీ బాణీలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలోనే ఉన్నాయి. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 220 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది రంగస్థలం. ఇలాంటి సూపర్ హిట్ మూవీని కేరళలో మలయాళం వర్షన్ లో రిలీజ్ చేయడం పట్ల మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











