For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ రోజుల్లోనే మొరటైన శృంగారం ఉంది.. సందీప్‌ని ఎందుకంటున్నారో! వీడియో పోస్ట్ చేస్తూ కంగనా సోదరి ఫైర్

|
Rangoli Chandel Extends Support To Sandeep Reddy Vanga || Filmibeat Telugu

ప్రేమికులను ఉద్దేశిస్తూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేవుతున్న సంగతి తెలిసిందే. ప్రేమికులన్నాక ముద్దు మురిపం, కొట్టుకోవడం లాంటివి ఉంటేనే ఆ బంధం దృడంగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో భాగంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ఈ ఇష్యులోకి ఎంటరైన కంగనా రనౌత్ సోదరి రంగోలి ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే..

 కబీర్ సింగ్ సక్సెస్.. విమర్శల వెల్లువ

కబీర్ సింగ్ సక్సెస్.. విమర్శల వెల్లువ

టాలీవుడ్‌లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్‌గా కబీర్ సింగ్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ కొందరు బాలీవుడ్ విమర్శకులు, సినీ ప్రముఖులు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సన్నివేశాలపై విమర్శలు గుప్పించారు. దీంతో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో వాటికి కౌంటర్‌గా సందీప్ రెడ్డి వంగా ప్రేమికుల గురించి అలా మాట్లాడారు.

సమంత, చిన్మయి, అనసూయ ఫైర్

సమంత, చిన్మయి, అనసూయ ఫైర్

లవర్స్ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన తీరుపై టాలీవుడ్ సెలబ్రిటీలు సమంత, చిన్మయి, అనసూయ స్పందించారు. సందీప్ మాట్లాడిన తీరును తప్పుబడుతూ వారు ట్వీట్స్ చేయడం జరిగింది. దీంతో ఈ ఇష్యు పై చర్చలు ముదిరాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్.. పాత బాలీవుడ్ సినిమాలోని రాజ్ కపూర్ రొమాంటిక్ సన్నివేశం ఒకటి పోస్ట్ చేస్తూ ఇదేంటని ప్రశ్నించింది.

రంగంలోకి రంగోలి.. నోరు మూయించేలా

ఈ వీడియో చూసి కంగనా సోదరి రంగోలి రంగంలోకి దిగింది. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే ఈమె సందీప్ రెడ్డిని విమర్శిస్తున్న వారిపై ఫైర్ అవుతూ సదరు వీడియోతో పాటు సందేశం పోస్ట్ చేసింది. ''రాజ్ కపూర్ సినిమాలోని శృంగారభరితమైన, మొరటైన సన్నివేశం ఇది. అసలు సిసలైన బాలీవుడ్ రూపం అంటే ఇది. రాజ్ కపూర్‌ను సినీ దిగ్గజంగా పరిగణించే మీరు ఇలా ఓ దక్షిణాది దర్శకుడి పట్ల ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం'' అని ఘాటుగా ప్రశ్నించింది.

65 ఏళ్ల క్రిందటి మోటు సరసం

65 ఏళ్ల క్రిందటి మోటు సరసం

దాదాపు 65 ఏళ్ల క్రిందట వచ్చిన రాజ్ కపూర్ సినిమాలోని మోటు సరసం అది. ఈ క్లిప్పింగ్ లో హీరోయిన్‌ను పరుగులెత్తించి చేయి మెలితిప్పి గుండెలకు హత్తుకుంటూ, చెంప చెళ్లుమనిపించడం చూడొచ్చు. మరి ఈ విషయంలో ఎవ్వరూ స్పందించడం లేదుగా! ఈ లెక్కన మొదటి 'కబీర్ సింగ్' సీనియర్ హీరో రాజ్ కపూరే అవుతాడుగా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కబీర్ సింగ్ హవా

కబీర్ సింగ్ హవా

ఓ వైపు వివాదాలు చుట్టుముడుతున్నా కబీర్ సింగ్ హవా మాత్రం కొనసాగుతూనే ఉంది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ కెమెస్ట్రీ.. సందీప్ రెడ్డి వంగా టేకింగ్ సినిమాలో హైలైట్‌గా నిలవడంతో బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది కబీర్ సింగ్. ఇప్పటికే 200 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా 300 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

English summary
Shahid kapoor and Kiara Advani plays tremendous role in Kabir Singh movie. They performed very well in liplock seens, romantic movements. In 14 days Kabir Singh collected over 200 crores. Rangoli Chandel support of Kabir Singh and its director Sandeep Reddy Vanga. She shared one clip of Raj Kapoor slapping Nargis in Awara to underline her argument.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more