సస్పెన్స్ థ్రిల్లర్ కథలో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్..
స్టార్స్ ఎంత మంది ఉన్నా కూడా కథలోని పాయింట్ జనాలకు ఎక్కకపోతే కష్టమంతా వృధా అవుతుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కాన్సెప్ట్ ఎంత కొత్తగా ఉంటే అంత బాగా లైక్ చేస్తున్నారు నేటితరం ఆడియెన్స్. నిజానికి అలాంటి సినిమాలకు ప్రమోషన్స్ కూడా అవసరం లేదు. ఇక త్వరలోనే 'నాటకం' ఫేమ్ ఆశిష్ గాంధీ కూడా అలాంటి సినిమాతోనే ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 'రంగులరాట్నం' ఫేమ్ చిత్ర శుక్ల హీరోయిన్ గా నటిస్తున్న ఆ సస్పెన్స్ థ్రిల్లర్ రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది
ఇక బాబీ ఏడిద క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఎవర్‌గ్రీన్ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సినిమా ప్రారంభ సన్నివేశం నుంచి ఆఖరి సన్నివేశం వరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని నిర్మాత వివరణ ఇచ్చారు. ఇక ఈ కథలోని మలుపులు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయని నాటకం తదితర చిత్రాల్లో నటించిన ఆశిష్ గాంధీ ఈ చిత్రంలో అలా డిఫరెంట్ పాత్రలో నటించనున్నారని తెలిపారు.

రంగుల రాట్నం, సిల్లీ ఫెలోస్, మా అబ్బాయి వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న చిత్ర శుక్ల ఇందులో కథానాయికగా కనిపించనుంది. ఇక త్వరలోనే సినిమా తారాగణం యొక్క పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. షూటింగ్ విషయానికి వస్తే డిసెంబర్ మొదటి వారం నుంచి రాజమండ్రి, కాకినాడ, నిడదవోలు, రంపచోడవరం, గుడిసె, రాజానగరం తదితర ప్రాంతాల్లో ఒక కీలకమైన షెడ్యూల్ కొనసాగనున్నట్లు నిర్మాత తెలిపారు.


Click it and Unblock the Notifications











