శంకర్ సంచలనాత్మక నిర్ణయం.. బాలీవుడ్ హీరోతో మరో అపరిచితుడు.. రాబోయేది ఎప్పుడంటే?
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ఒరవడి సృష్టించిన తమిళ దర్శకుడు శంకర్ షణ్ముగం మరొక బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా భాషతో సంబంధం లేకుండా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆలస్యంగా సినిమాలు తీసినప్పటికి తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక ఆయన కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచిన అపరిచితుడు కాన్సెప్ట్ ను మరోసారి వెండితెరపైకి తీసుకు రాబోతున్నాడు.

సక్సెస్ దూరంగా ఉన్నప్పటికీ
2.O అనంతరం సక్సెస్ కొంచెం దూరంగా ఉన్నప్పటికీ శంకర్ వాల్యూ మాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమాలు చేయడానికి అగ్ర హీరోలు నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇండియన్ 2 సినిమా ప్రొడక్షన్ హౌజ్ తప్పిదం వల్ల ఆలస్యం అవుతున్న విషయం తెలిసిందే. ఇక శంకర్ ఆ సినిమాను ఎలాగైనా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు.

మరోసారి అపరిచితుడు.. 2.O
లాక్ డౌన్ లో చాలా గ్యాప్ రావడంతో శంకర్ కొన్ని పవర్ఫుల్ కథలను రెడీ చేసుకున్నాడు. ఇక ఇండియన్ 2 అనంతరం అదే తరహాలో ఆలోచించి అపరిచితుడు కాన్సెప్ట్ తో మరో వెర్షన్ ను రాసుకున్నాడు. ఈ సారి పాన్ ఇండియా రేంజ్ లో ఆ కథను ప్రజెంట్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు.

16 ఏళ్ళ అనంతరం
2005లో విక్రమ్ హీరోగా తమిళ్ లో తెరకెక్కిన అపరిచితుడు సినిమా తెలుగులో కూడా బాక్సాఫీస్ హిట్ గా నికిచింది. ఇక హిందీలో కూడా విడుదల చేసినప్పటికీ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక మళ్ళీ 16ఏళ్ళ అనంతరం దర్శకుడు శంకర్ అపరిచితుడు పాత్రతోనే కొత్త తరహా కథను రెడీ చేశాడట.

సినిమా వచ్చేది ఎప్పుడంటే
హీరోగా బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తున్నాయి. ఇక ఫైనల్ గా అదే నిజమయ్యింది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ జయంతి లాల్.. పెన్ స్టూడియోస్ పై ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మించబోతున్నట్లు చెప్పారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జూన్ అనంతరం స్టార్ట్ కావచ్చని సమాచారం. సినిమా రిలీజ్ 2023లో ఉండవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











