రణ్‌వీర్ సింగ్‌తో మూడోసారి.. దీపిక పెళ్లి తర్వాత రెండోసారి!
బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలు, సినిమాలతో రణ్‌వీర్ సింగ్, అలియాభట్ ఆకట్టుకొంటున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి నటించిన గల్లీబాయ్ చిత్రం సూపర్ సక్సెస్‌ను చేజిక్కించుకొన్నది. ఇలా హాట్ ఫేవరేట్‌గా మారిన జంట ముచ్చటగా మూడోసారి కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. దీపికాతో పెళ్లి తర్వాత అలియాతో వరుసగా మూడు చిత్రాల్లో నటించడం గమనార్హం
బాలీవుడ్ మీడియా ప్రకారం.. అలియాభట్, రణ్‌వీర్ సింగ్ మరోసారి జత కడుతున్నారు. బాలీవుడ్‌లో ప్రముఖ బ్యానర్ రూపొందించే సినిమా కోసం వీరిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

గల్లీబాయ్ తర్వాత అలియా, రణ్‌వీర్ తఖ్త్ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. కరణ్ జోహర్ రూపొందించే ఈ చిత్రంలో అనిల్ కపూర్, జాహ్నవి కపూర్, కరీనా కపూర్, భూమి పడ్నేకర్, వికీ కౌశల్ నటిస్తున్నారు.
అలియాభట్, రణ్‌వీర్ సింగ్ వేర్వేరు ప్రాజెక్టుల్లో కూడా బిజీగా ఉన్నారు. అలియా భట్ కళంక్ చిత్రంలోను, RRR చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే చిత్రం ఇన్షా అల్లా చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో జతకడుతున్నారు. రణ్ వీర్ సింగ్ క్రికెట్ ఆధారంగా రూపొందే 83 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కపిల్ దేవ్‌గా రణ్‌వీర్ సింగ్ కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











