ఏ సినిమాకి ఇంత కష్టపడలేదు.. కపిల్ దేవ్‌ని నీడలా వెంటాడతా!
క్రేజీ హీరో రణవీర్ సింగ్ వరుస విజయాలతో దూసుకుపోతోన్నాడు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన సింబా చిత్రం మంచి విజయం సాధించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన గల్లీ బాయ్ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో రణవీర్, అలియా భట్ జంటగా నటించారు. కాగా ప్రస్తుతం రణవీర్ సింగ్ మరో ఆసక్తికరమైన బయోపిక్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం అన్ని చిత్రపరిశ్రమలో బియోపిక్స్ ట్రెండ్ కొనసాగుతోంది.
రణవీర్ సింగ్ టీం ఇండియాకు తొలి ప్రపంచకప్ అందించిన మాజీ సారధి కపిల్ దేవ్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 83 పేరుతో తెరకెక్కుతోంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రం కోసం తాను ఎంతగా కష్టపడుతున్నానో వివరించాడు. ఇంతవరకు నేను ఏ చిత్రానికి ఇంత కష్టపడలేదు. కపిల్ దేవ్ బ్యాటింగ్ ఎలా ఉండేది, బౌలింగ్ శైలి ఎలా ఉండేది ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటున్నా.

కపిల్ దేవ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుంటే ఆయన్నే అడగాలి. అందుకే కపిల్ దేవ్ కు నీడలా మారి వెంట పడాలని భావిస్తున్నట్లు రణవీర్ సింగ్ తెలిపారు. 83 చిత్రాన్ని దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్నారు. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











