Dhurandhar 2 కోసం రణ్‌వీర్ సింగ్ రిస్క్.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ!

Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్యధర్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'ధురంధర్: ది రివేంజ్'(Dhurandhar 2). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో పాత రికార్డులను బద్దలు కొట్టి నయా రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇలా బాక్సాఫీస్ సెన్సేషన్ గా మారిన ధురంధర్ మూవీకి సంబంధించిన ఓ మేకింగ్ వీడియో ఈ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఈ వీడియో ఏముంది?

ధురంధర్ 2 కలెక్షన్లు లెక్కలు..
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా ధురంధర్ 2. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ సినిమా కలెక్షన్లు చూస్తే... ప్రీమియర్లతోనే రూ 43 కోట్ల నెట్, రూ 52 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా, తొలి రోజే రూ. 102 కోట్ల నెట్, రూ.121 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో ప్రీమియర్స్ కలిపి మొదటి రోజుకే రూ. 173 కోట్ల గ్రాస్ దాటింది.

Ranveer Singh Stuns with Life-Risking Underwater Act in Dhurandhar 2 BTS Video Goes Viral

రెండో రోజూ అదే జోరు కొనసాగిస్తూ సుమారు రూ. 80 కోట్ల నెట్, రూ.97 కోట్ల గ్రాస్ వసూలు చేసి, మొత్తం రెండు రోజుల్లో రూ. 270 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదు చేసింది. ఇక ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా అదే రేంజ్‌లో దూసుకెళ్తుంది. రెండు రోజుల్లోనే సుమారు 8.3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 78 కోట్లు) రాబట్టింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 333 కోట్ల నెట్,రూ. 374 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న ధురంధర్ 2 పై సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ స్టార్‌లు మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖులు తన రివ్యూ ఇస్తున్నారు. ఇందులో ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి 'ధురంధర్:ది రివెంజ్' పై ప్రశంసల వర్షం కురిపించారు. మొదటి భాగం కంటే ఈ సీక్వెల్ కథ,స్కేల్, టెక్నికల్ అంశాల్లో మరింత మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. రైటింగ్, కాస్టింగ్, మ్యూజిక్, డైరెక్షన్ అన్ని పర్ఫెక్ట్‌గా ఉన్నాయని, ఎమోషన్స్‌తో కూడిన ట్విస్టులు సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాయని చెప్పారు. నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేసిందని అభినందించారు.

ఇక హీరో రణ్ వీర్ సింగ్ నటనను ప్రశంసిస్తూ..హమ్జా-జస్క్రిత్ పాత్రల్లో ఆయన ప్రదర్శన 'మాస్టర్‌క్లాస్'గా అభివర్ణించారు. ఇది ఒక గొప్ప సినీమాటిక్ అనుభవమని రాజమౌళి అన్నారు. ధురంధర్ 2 నిజమైన హీరోని కొత్తగా పరిచయం చేసింది, ఇది బెంచ్ మార్క్ మూవీ అంటూ అభిప్రాయాన్ని వెల్లడించారు. మరోకొందరూ ఈ సినిమా ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్‌ను చూసి కొంతమంది 'ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్‌లో కేస్ స్టడీగా చూపించాలి' అని కామెంట్ చేయడం విశేషం. టెక్నికల్‌గా, ఎమోషనల్‌గా సినిమా తీసిన విధానం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వీడియో వైరల్
ఇదిలా ఉంటే.. తాజాగా ధురంధర్ మూవీ నుంచి ఓ బీహైండ్ ది సీన్స్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇందులో రణవీర్ సింగ్ అండర్‌వాటర్ సీన్ కోసం చాలా సేపు శ్వాస ఆపుకుని నటించడం కనిపిస్తోంది. ఎలాంటి గ్రాఫిక్స్ లేదా డూప్‌లపై ఆధారపడకుండా, రియల్‌గా ఆ సీన్ చేయడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీంతో హీరో రణ్ వీర్ సింగ్ నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది ఇది ఆయన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన చూపించిన డెడికేషన్, చేసిన రిస్క్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందన్నారు.

'ఈ సినిమా కోసం రణవీర్ అంకితభావంతో పనిచేశాడు' ' ప్రాణాలు పణంగా పెట్టి షూట్ చేశారు' 'ఇంత సేపు ఎలా ఊపిరి ఆపుకున్నాడు?' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేటీ కాలంలో డుబ్ లేకుండా, ఇలా రిస్కీ షాట్స్ చేయడం నిజంగా గేట్ అని చెప్పాలి. ఇప్పటికే పలువురు 'ఇది యాక్టింగ్ మాస్టర్‌క్లాస్' అంటూ పలువురు సినీప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకే చాలా మంది ఇది రణవీర్ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ నటనగా పేర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X