Ranveer Singh: ధురంధర్ హీరో నెక్ట్స్ సినిమా ఫిక్స్.. స్టోరీ లైన్ మామూలుగా లేదు..

Ranveer Singh Next Movie: బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్.. ధురంధర్ సిరీస్‌తో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారిపోయారు. తాజాగా ధురంధర్ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేస్తోంది. పాత రికార్డుల బద్దలు కొట్టి, నయా రికార్డులను తిరగరాస్తోంది. ఈ సక్సెస్ తర్వాత ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే.. రణ్‌వీర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ లైన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని టాక్. ఆ సినిమా అప్డేట్స్ మీ కోసం..

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రోజురోజుకు కలెక్షన్లలో దూసుకెళ్తుంది. ఈ మూవీ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1,605.74 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ క్రమంలో అత్యంత వేగంగా రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా ధురంధర్ 2 సంచలనం సృష్టించింది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1,213.74 కోట్ల గ్రాస్, రూ. 1,013.77 కోట్ల నెట్ వసూలు చేసి భారీ రికార్డులు సృష్టించింది.

Ranveer Singh s Next movie Pralay Zombie Thriller After Dhurandhar 2 Success

ఈ రికార్డు రన్‌లో భాగంగా పలు బ్లాక్‌బస్టర్ సినిమాల లైఫ్‌టైమ్ కలెక్షన్లను కూడా అధిగమించడం విశేషం. ఈ సక్సెస్‌తో రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద హిట్‌గా నిలవడమే కాకుండా, బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన సినిమాగా గుర్తింపు పొందింది. అయితే ఈ విజయంతో ఆగిపోకుండా, తన తదుపరి ప్రాజెక్ట్‌గా మరింత పెద్ద కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

రణ్ వీర్ సింగ్ తదుపరి ప్రాజెక్ట్ 'ప్రళయ్'. ఈ సినిమాపై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఇది 'బ్లైండ్‌నెస్' అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతుందన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్లకు దర్శకుడు హన్సల్ మెహతా పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు హన్సల్ మెహతా 'ప్రళయ్' సినిమా గురించి కీలక అంశాలు వెల్లడించారు. ముఖ్యంగా 'ప్రళయ్' మూవీని ఏ పుస్తకం ఆధారంగా కాదు, పూర్తిగా ఒరిజినల్ స్టోరీతో తెరకెక్కుతోందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సినిమా పోస్ట్-అపోకలిప్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే భారీ బడ్జెట్ జాంబీ థ్రిల్లర్‌గా రూపొందించబడుతున్నట్టు తెలిపారు. అంటే, ఒక భారీ విపత్తు తర్వాత ప్రపంచంలో మనుషుల సర్వైవల్ కోసం జరిగే పోరాటాన్ని ప్రధానంగా చూపించనున్నారు. దర్శకుడు జై మెహతా ఈ కథపై చాలా కాలంగా పని చేస్తున్నారట. రణ్‌వీర్ సింగ్ స్వయంగా తనని సంప్రదించి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువచ్చారని డైరెక్టర్ హన్సల్ చెప్పారు. తన గతసినిమాలను చూసి రణ్‌వీర్, ఈ కాన్సెప్ట్ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు.

ఇక ముఖ్యంగా, 'ప్రళయ్' ఏ పుస్తకం లేదా పాత సినిమాకు రీమేక్ కాదని స్పష్టం చేశారు. జై మెహతా , విశాల్ కపూర్ కలిసి ఈ కథను పూర్తిగా ఒరిజినల్‌గా రూపొందించారు. ఈ సుమారు రూ.30 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. జాంబీలతో నిండిన ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలనే లక్ష్యంతో మూవీ మేకర్స్ పనిచేస్తున్నారంట. ప్రేక్షకులు ఆ ప్రపంచంలోకి పూర్తిగా మునిగిపోయేలా 'ఇమ్మర్షన్'పై ప్రత్యేక దృష్టి పెట్టారట. 'ప్రళయ్' చిత్రం 2026 మధ్యలో షూటింగ్ ప్రారంభం కానుండగా, ఇది జై మెహతా డైరెక్టర్‌గా చేయడం తొలి చిత్రం కావడం విశేషం.

'ధురంధర్ 2'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రణ్‌వీర్ సింగ్, 'ప్రళయ్'తో జాంబీ జానర్‌లోకి అడుగుపెడుతూ మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే, భారతీయ సినీ పరిశ్రమలో జాంబీ, పోస్ట్-అపోకలిప్టిక్ కథలు సినిమాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో.. ఈ సినిమా ధురంధర్ లాంటి సక్సెస్ అందుకుంటుందా? లేదా? రణ్ వీర్ సింగ్ ఈ కొత్త జోనర్ తో రిస్క్ లో పడే అవకాశముందా? అనే చర్చ కూడా నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X