అమ్మాయిలతో రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన హీరోయిన్ తండ్రి
కర్ణాటకలో రాసలీలల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో పలువురు రాజకీయ నాయకులు, అత్యున్నత స్థాయి అధికారులకు సంబంధించిన రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా.. వారి రాజకీయ జీవితాలు, ఉద్యోగుల కెరీర్‌లు ముగిసిపోయాయి. ఇలాంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోని కొందరు బలహీనతకు లొంగిపోయి పరువు పొగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కర్ణాటకలో మరోసారి వెలుగు చూసింది. ఏకంగా డీజీపీ ర్యాంక్ అధికారి తన కార్యాలయంలో, తన ఛాంబర్‌లోనే అమ్మాయిలతో రాసలీలలు చేస్తున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దాంతో పోలీస్ శాఖ పరువు గంగలో కలిసిపోయింది. అసలేం జరిగిందంటే?
ఛాంబర్‌లోనే అమ్మాయిలతో రాసలీలలు
సదరు వీడియోలలో కర్ణాటక సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (డీసీఆర్ఈ) డీజీపీగా విధులు నిర్వహిస్తున్న రామచంద్రరావు.. ఛాంబర్‌లో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పలువురు అమ్మాయిలతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ.. వారిని ముద్దు పెట్టుకుంటూ, తాకుతూ రామచంద్రరావు కనిపించారు. పవిత్రమైన ఖాకీ డ్రెస్ ధరించి.. జాతీయ పతాకం, పోలీస్ శాఖ చిహ్నం ముందే ఆయన తన లైంగిక కోరికలు తీర్చుకున్నారు.

డీజీపీపై సీఎం సీరియస్
ఈ వీడియోలు మీడియాలో, సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు హోంమంత్రి జీ పరమేశ్వర కార్యాలయానికి రామచంద్రరావు వెళ్లగా.. డీజీపీతో మాట్లాడేందుకు మంత్రి నిరాకరించినట్లుగా వార్తలు వచ్చాయి. అటు డీజీపీ రామచంద్రరావు రాసలీలల వీడియోలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై పూర్తి నివేదిక సమర్పించాలని హోంశాఖను ఆదేశించారు.
అవన్నీ మార్పింగ్ వీడియోలు
అయితే రామచంద్రరావు మహిళలతో సన్నిహితంగా గడిపిన వీడియోలను ఎప్పుడు? ఎవరు చిత్రీకరించారు? ఇప్పుడు ఎందుకు బయటపెట్టారు? అనేది కర్ణాటక పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. మరోవైపు.. ఈ వివాదంపై రామచంద్రరావు స్పందించారు. అవన్నీ మార్ఫింగ్ చేసిన వీడియోలని, తన న్యాయవాదిని సంప్రదించి చట్టపరంగా చర్యలు తీసుకుంటానని రామచంద్రరావు మీడియాకు తెలిపారు.
రామచంద్రరావుపై సస్పెన్షన్ వేటు
మరోవైపు... డీజీపీ రాసలీలల వ్యవహారం కర్ణాటకతో పాటు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశం కావడంతో సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా పనిచేస్తున్న రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన నిబంధనలను ఉల్లంఘించారని, విచారణ ముగిసేంత వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని, ఈ కాలంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బెంగళూరు విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలోనూ అమ్మాయిలతో అలాంటి పనులు
అయితే రామచంద్రరావు గత చరిత్ర మొత్తం వివాదాస్పదమే. గతంలో బెళగావిలో పనిచేస్తుండగా ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో పోలీస్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఇక గతేడాది మార్చిలో కన్నడ నటి రన్యా రావు.. విదేశాల నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఈ ఘటన భారతీయ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఆవిడ వద్ద నుంచి దాదాపు 14.7 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రన్యారావుకు ఇప్పుడు రాసలీలల వీడియోలతో దొరికిపోయిన డీజీపీ రామచంద్రరావుకు స్వయానా సవతి తండ్రి కావడం గమనార్హం.
ఆ హీరోయిన్‌కు తండ్రి
ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసులోనూ రామచంద్రరావుపై ఆరోపణలు వచ్చాయి. సవతి తండ్రి అధికారాన్ని, హోదాను అడ్డుపెట్టుకుని విమానాశ్రయాల్లో చెకింగ్ నుంచి మినహాయింపు పొందిన రన్యారావు.. యధేచ్చగా బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడినట్లుగా దర్యాప్తులో తేలింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రామచంద్రరావు ప్రమేయంపై తేల్చేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అలాగే గతేడాది మార్చిలో రామచంద్రరావును నిర్బంధ సెలవుపై పంపింది. ఇటీవలే తిరిగి ఆయనకు పోస్టింగ్ ఇస్తూ.. సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్ (డీసీఆర్ఈ) డీజీపీగా నియమించింది. ఇంతలోనే రామచంద్రరావు రాసలీలల్లో మునిగి తేలిన వీడియోలు చక్కర్లు కొట్టడం, ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేయడం జరిగిపోయింది.


Click it and Unblock the Notifications











