అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ నుంచి రావు రమేష్ తప్పుకున్నారా?
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని AA19గా పిలుస్తున్నారు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుగుతుండగా ఓ న్యూస్ చర్చనీయాంశం అయింది. ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రముఖ నటుడు రావు రమేష్ తప్పుకున్నారట.
రావు రమేష్‌ను ఈ మూవీలో కీలక పాత్ర కోసం ఎంపిక చేశారని, అయితే ఆయన చాలా బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తప్పుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వరకు రావు రమేష్ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆయన స్థానంలో మరొకరిని తీసుకుంటున్నారట.

'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం. ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేని బన్నీ.... ఈ సారి ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో ఈ చిత్రం చేస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు 'నాన్న నేను' అని పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో తండ్రి సెంటిమెంట్ చూపించబోతున్నారట. స్వాతంత్ర దినోత్సవం సందర్భగా ఆగస్టు 15న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











